YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

జూన్ 12న ట్రంప్,ఉన్ సమావేశం

జూన్ 12న ట్రంప్,ఉన్ సమావేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య చారిత్రక సమావేశం జూన్ 12న జరుగుతుందని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. అనుకున్న తేదీన భేటీ జరుగకపోవచ్చునని ట్రంప్ ప్రకటించిన మరుసటిరోజే పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అమెరికన్ కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల కమిటీ ముందు హాజరైన పాంపియో.. అమెరికా జాతీయ భద్రతా ప్రాధాన్యతల్లో ఉత్తర కొరియా అణునిరాయుధీకరణ ఒకటని చెప్పారు. ఉత్తర కొరియాపై దౌత్యపరమైన, ఆర్థిక ఆంక్షల ఒత్తిళ్లు సానుకూల ఫలితాలను రాబడుతున్నాయని పాంపియో వివరించారు. మరోవైపు పుంగ్య్-రి అణుప్రయోగ క్షేత్రాన్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని తిలకించేందుకు విదేశీ జర్నలిస్టులు బయల్దేరి వెళ్లారు.

Related Posts