YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్.... దమ్ముంటే నీ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫకేట్ బయటపెట్టు

కేసీఆర్.... దమ్ముంటే నీ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫకేట్ బయటపెట్టు

కేసీఆర్.... దమ్ముంటే నీ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫకేట్ బయటపెట్టు
బీఆర్ఎస్ అంటే బీరు...రమ్... స్కాచ్ పార్టీ
కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
ముఖ్యమంత్రి కేసీఆర్.  దమ్ముంటే నీ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫకేట్ బయటపెట్టు అంటూ బీజేపీ రాష్ట అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజాన్ని చదివి దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళుతుంటే... కేసీఆర్ కుటుంబం చదువుకున్న చదువును డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు ఉపయోగిస్తూ వేల కోట్లు దోచుకుంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే బీరు...రమ్... స్కాచ్ పార్టీ అని,  కేసీఆర్ కుటుంబం మీరంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులని ఎద్దేవా చేశారు. 8 ఏళ్ల క్రితం ఇల్లు తప్ప ఏమీలేని కేసీఆర్ నేడు వేల కోట్లతో ప్రతిపక్ష పార్టీలకు డబ్బులిచ్చే స్థాయికి ఎట్లా ఎదిగారని ప్రశ్నించారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నిర్వహించబోయే సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తదితురులతో కలిసి పరేడ్ మైదానానికి వచ్చిన బండి సంజయ్ ఈనెల 8న సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ఉదయం 10.30 గంటలకు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయానికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు హాజరవుతారని వెల్లడించారు. మిగులు రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిండు.. బీఆర్ఎస్ అంటేనే అంతర్జాతీయ దొంగల ముఠా. స్కీంల ద్వారా ఏ విధంగా స్కాంలు చేయాలో ట్రైనింగ్ ఇచ్చే సంస్థ బీఆర్ఎస్ భవన్. బీఆర్ఎస్ అంటేనే బీరు, రమ్ము, స్కాచ్ పార్టీ. కేసీఆర్ పాలనలో అన్నీ లీకులే.. ఆయన తాగి పడుకుంటడు.. అన్నీ లీకులే. ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వం. లీకుల జాతర నడుస్తోంది. అవినీతి సొమ్ముతో పొట్టుపొట్టు పైసలు సంపి విదేశాల్లో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు.
కేసీఆర్....8 ఏళ్ల క్రితం నీ బతుకేంది. నందినగర్ లో ఓ ఇల్లు మాత్రమే ఉండే . నీ బిడ్డకు అపార్ట్ మెంట్లో అద్దెకుంది. నీ కొడుకుకు ఇల్లేలేదు. ఇప్పుడు వేల కోట్లు ఎట్లా సంపాదించినవ్? రాష్ట్ ప్రజల భవిష్యత్ ఎట్లా అంధకారమైందని నిలదీసారు. నీ దిక్కుమాలిన పాలనలో అన్నీ లీకులే.. కాళేశ్వరం పంపులు లీకేజే... డబుల్ బెడ్రూం ఇండ్ల లీకేజే... ధరణి పోర్టల్ భూముల వివరాలన్నీ లీకులే... టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకులే..
టెక్నాలజీలో నేను తోపుని చెప్పుకుంటున్న కేసీఆర్ కొడుకు ఏం చేసిండు.. టెక్నాలజీని ఎట్లా లీక్ చేయాలి? దొంగలంతా ఎట్లా టెక్నాలజీని లీక్ చేయాలో నేర్పుతుండా ?
ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేతకాదు.. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ట్రిపుల్ ఐటీని నిర్వీర్యం చేశారు. పురుగుల అన్నం తిన్పిస్తున్నరు. ఉద్యోగాల నిర్వహణ చేతగాదు. మరి కేంద్రం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఎక్కడైనా పొరపాటు జరిగిందా? మరి ఇక్కడెందుకు లీకులైతున్నయో సమాధానం చెప్పాలని అన్నారు.

Related Posts