YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యాపిల్ ఐఫోన్, యూజర్లకు.. భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరికలు

యాపిల్ ఐఫోన్, యూజర్లకు.. భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్  హెచ్చరికలు

న్యూ డిల్లీ ఏప్రిల్ 4
యాపిల్ ఐఫోన్, వాచ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టం యూజర్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక) మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఉన్న లొసుగులు/లోపాలు/వల్నరబిలిటీస్కారణంగా హ్యాకర్లు యాపిల్ డివైజ్లలో చొరబడే ప్రమాదముందంటూ హైలెవల్ సెక్యూరిటీ వార్నింగ్ను జారీ చేసింది. మ్యాక్ కంప్యూటర్లు యాపిల్ చేతి గడియారాలుయాపిల్ టీవీలులో సైబర్ సెక్యూరిటీపరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ లోపాల కారణంగా యాపిల్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించే ప్రమాదముందని వెల్లడించింది. ఈ మేరకు సెర్ట్ తన వెబ్‌సైట్‌లో హెచ్చరికలను పోస్ట్ చేసింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆయా డివైజ్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
ఐఫోన్, వాచ్‌లలో ఇలా..
మాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఉన్న సఫారీ వెబ్ బ్రౌజర్‌లో ఈ వల్నరబిలిటీలు ఉన్నట్లు వెల్లడించింది. ఆ బ్రౌజర్‌లోని వెబ్‌కిట్‌లో ఉన్న లొసుగులను హ్యాకర్లు ఆసరాగా చేసుకుని, యాపిల్ వాచ్‌లలోకి, ఐఫోన్లలోకి రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ద్వారా చొరబడే ప్రమాదముందని తెలిపింది. సఫారీ బ్రౌజర్ 16.4 వెర్షన్‌(కు అప్‌గ్రేడ్(అవ్వడం ఒక్కటే మార్గమని సూచించింది. అందుకోసం యాపిల్ యాప్‌స్టోర్‌లో డెస్క్‌టాప్ యాప్‌ లోని యాప్‌స్టోర్ టూల్‌బార్‌లో కనిపించే అప్‌డేట్స్‌ ఆప్షన్‌ను క్లిక్ చేయాలని వివరించింది.
మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్లకు..
ఐఫోన్లతో పోలిస్తే.. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్‌టాప్‌లలోకి, కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడే ప్రమాదం ఎక్కువ అని సెర్ట్-ఇండియా హెచ్చరించింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పలు రకాల వల్నరబిలిటీస్ ఉన్నట్లు తెలిపింది. దీని వల్ల మెమొరీ సమస్యలు, ఇన్‌పుట్/ఔట్‌పుట్ పనితీరు అస్తవ్యస్థంగా తయారవ్వడం, కర్ల్ సమస్యలు బౌండ్ చెకింగ్‌ లో దారుణ ఫలితాలు, ప్రైవసీ సమస్యలులాజిక్ సమస్యలువస్తాయని వివరించింది.హ్యాకర్లకు నేరుగా చొరబడి, సమాచారాన్ని తస్కరించడం, మార్చడం చేసే వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేసింది. మ్యాక్ ఓఎస్ వెంచురావెర్షన్ 13.3 కంటే పాత వెర్షన్‌లలో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపింది. అదేవిధంగా మ్యాక్ ఓఎస్ బిగ్ సర్) వెర్షన్ 11.75, మ్యాక్ ఓఎస్ మోనిటరీ వెర్షన్ 12.6.4 కంటే పాత వెర్షన్‌లు వాడుతున్న వినియోగదారులు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

Related Posts