YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం

కరీంనగర్
బండి సంజయ్ అరెస్ట్ పై రాష్ట్ర వ్యప్తంగా బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబీకుతున్నాయి.  బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా నిరసిస్తూ అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి కరీంనగర్ లో కేసీఆర్ దిష్టబొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్దం చేసారు. అయనను  తక్షణమే విడుదల చేయాలని రోడ్లపై బైఠాయించి డిమాండ్ చేసారు. పలు చోట్ల  బండి సంజయ్  అరెస్ట్ ను నిరసిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగారు.

ఛలో బొమ్మల రామారం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్ట్ ను నిరసిస్తూ బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్ వద్ద ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. భారీ ఎత్తున కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లను సైతం బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ‘‘ఛలో బొమ్మల రామారం’’ మేడ్చల్ జిల్లా బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున తరలివస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు బొమ్మల రామారానికి తరలివచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసు  స్టేషన్ ఎదుట వున్న టీ స్టాల్, ఇతర షాపులను మూసివేయించారు.

Related Posts