YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ నేతలే టార్గెట్ గా మావోయిస్టులు

గులాబీ నేతలే టార్గెట్ గా మావోయిస్టులు

వరంగల్, ఏప్రిల్ 5, 
గత రెండు మూడు రోజుల నుంచి ములుగు ఏజెన్సీ పరిధిలో హైట్ టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల యాక్షన్ టీం సంచరిస్తుందనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక భాగాలతో ఏజెన్సీ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అంతేకాకుండా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.పోలీసులు మావోయిస్టు అగ్ర నేతల వాంటెడ్ లిస్ట్ కరపత్రాలను పట్టుకొని ఒకవైపు వాహనాలను తనిఖీ చేస్తూ యాక్షన్ టీం సభ్యుల ఫోటోలను చూపిస్తూ లిస్టులో ఉన్నవారి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈరోజు మావోయిస్టుల నుంచి లేఖలు కలకలం సృష్టించాయి.ఏకంగా అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టులు కరపత్రం విడుదల చేయడం కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఏటూరు నాగారం పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు తమ పద్ధతిని మార్చుకోకపోతే ఎవరిని వదిలిపెట్టం, చంపేస్తామని కూడా లేఖలో పొందుపరిచారు.కొందరు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోవాలని, మారకపోతే వదిలిపెట్టమని నాయకులను హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులు సైతం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, వారు కూడా పద్ధతి మార్చుకోవాలని ఫారెస్ట్ అధికారులను సైతం మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ఏజెన్సీ, అటవీ ప్రాంతాన్ని పోలీస్ ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్న నేపథ్యంలో మావోయిస్టు విడుదల చేసే కరపత్రాలు ములుగు జిల్లా వ్యాప్తంగా హై టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. మావోయిస్టులు కూడా వారి కరపత్రాలలో చాలా స్పష్టంగా పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిలిపివేయాలని హెచ్చరిస్తున్నారు.ఏజెన్సీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. 'సమాచారం మాకు బహుమతి మీకు' అనే నినాదంతో పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం మండలం ఎదిర గ్రామం వద్ద మావోయిస్టు అగ్ర నేతల వాంటెడ్ లిస్ట్ కరపత్రాలను పట్టుకొని వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు.తెలంగాణలో యాక్షన్ టీమ్ సంచరిస్తుందనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ప్రత్యేక బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు నేతలు బద్రు, మహేష్, మహిందర్, కరుణాకర్ ఫోటోలతో ఉన్న కరపత్రాలను చూపిస్తూ ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ, అనుమానితుల వివరాలు సేకరిస్తూ, మావోల సమాచారం తెలిసిన పోలీసులకు అందించాలని తనీఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. యాక్షన్ టీంలో సభ్యుడైన బద్రు పేరుతో లేఖ విడుదల కావడంతో ఏజెన్సీ ఉలిక్కిపడింది.

Related Posts