YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓటమి ఎరుగని ప్రజానాయకుడు జగ్జీవన్ రామ్

ఓటమి ఎరుగని ప్రజానాయకుడు జగ్జీవన్ రామ్

ఎమ్మిగనూరు
 ఎమ్మిగనూరు పట్టణంలో  స్వాతంత్ర్య  సమరయోధుడు, దళిత హక్కుల పరిరక్షకుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రకటించి గౌరవించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు గౌ శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బుధవారం స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయం నందు *డా. బాబు జగ్జీవన్ రామ్  115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ....1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రం, షాబాద్ జిల్లా, చాంద్వా గ్రామంలో... నిమ్న జాతి కులంలో జన్మించిన జగ్జీవన్ రామ్ బాల్యం నుంచే దేశభక్తిని పునికి పుచ్చుకొని జాతీయోద్యమమైన స్వాతంత్ర్య సంగ్రామంలో... పాల్గొని పరాయి పాలకులతో పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడని కొనియాడారు. కేంద్రంలో అనేక కీలక శాఖలకు మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, దేశానికి ఉప ప్రధానిగా సేవలు అందించి దేశ సమగ్రతకు, అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన పరిపాలనా దర్శకుడని తెలిపారు.1971 లో.. పాకిస్తాన్ తో యుద్ధం చేసి గెలుపు సాధించి పెట్టి తూర్పు పాకిస్తాన్ ప్రస్తుతం "బంగ్లాదేశ్" కు స్వాతంత్ర్యం అందించి ప్రపంచంలోనే భారతదేశానికి గౌరవాన్ని, కీర్తిని ప్రసాదింప చేసిన ఘనత ఆ మహానీయునికే దక్కిందన్నారు. జగ్జీవన్ రామ్  మరణించేంతవరకు "ససారాం" లోకసభ స్థానం నుండి 9సార్లు పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైన ఓటమెరుగని ప్రజా నాయకుడు అని కొనియాడారు. ఇలాంటి మహోన్నత నాయకుడికి "భారతరత్న" బిరుదును ప్రకటించి గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి. అల్తాఫ్, ఆం.ప్ర.రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, ఎమ్మిగనూరు మండలం మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, మల్కా పురం పురుషోత్తం రెడ్డి, తెలుగు మహిళా నాయకురాలు గోకారమ్మ, టౌన్ నాయకులు కోడిగంటి శంకరన్న, యన్. సురేష్ కుమార్, కె.యం.డి.అబ్దుల్ జబ్బర్, రోజా ఆర్ట్స్ ఉసేని, బెస్త హనుమంతు, సిద్ద రామేశ్వర రెడ్డి, పట్టణ టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు గోరాభాష, మహబూబ్ బాషా,మేటి వలి భాష,ఆఫ్గన్ వలిభాష, యస్.సి.సెల్ నాయకులు దర్జీ మోషన్న, మాల మునిస్వామి, సాల్మన్, వన్నెల మోష, జాలవాడి ఏసన్న, జె. జయపాల్, 6వ వార్డు శంకర్, యన్.ఆదెన్న, ఎమ్మిగనూరు మండలం టిడిపి నాయకులు గుడికల్ కోలంట్ల వెంకటేష్, కె. తిమ్మాపురం బి.టి.చిన్న హనుమంతు, కందనాతి మునెప్ప తదితరులు పాల్గొన్నారు.

Related Posts