YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండి సంజయ్ అరెస్ట్.. చుట్టూ అసలేం జరుగుతోంది?

బండి సంజయ్ అరెస్ట్.. చుట్టూ అసలేం జరుగుతోంది?

హైదరాబాద్ ఏప్రిల్ 5
వరంగల్ లో జరిగిన పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఈ కేసులో ఓ జర్నలిస్ట్ ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో అతడు టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు కాల్ చేసినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ కేసులో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పక్కా ఆధారాలు సేకరించినట్టుగా చెబుతున్న పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ లో అరెస్ట్ చేశారు. అయితే బండి సంజయ్ ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న కారణాలను మాత్రం పోలీసులు ఆయనకు మీడియాకు ఇప్పటివరకూ తెలుపలేదు. బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీసు వాహనంలో ‘బొమ్మలరామారం' పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు బీజేపీ కార్యకర్తలకు  పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది.
-ప్రశాంత్ అరెస్ట్ తర్వాత బండి అరెస్ట్
వాట్స్ అప్స్  ప్రశ్నపత్రం పెట్టిన నిందితుడు ప్రశాంత్ బీజేపీ కార్యకర్త అని సమాచారం. ఈయన మాజీ జర్నలిస్ట్ అని కూడా చెబుతున్నారు. ప్రశాంత్ ద్వారానే సంజయ్కు ప్రశ్నపత్రం చేరిందని పోలీసులు చెబుతున్నట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది. మంత్రి హరీష్ రావు కూడా ఇదే ఆరోపించారు. సంజయ్కు ప్రశ్నపత్రం పంపిన ప్రశాంత్.. 2 గంటల్లో 142 సార్లు ఫోన్లో మాట్లాడాడని వెల్లడించారు. లీకేజీ విషయంలో భాగంగానే సంజయ్కు కూడా ఫోన్ చేశాడని ఆరోపించారు. తన ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే మంత్రి హరీశ్రావు ఈ మాటాలు మాట్లాడినట్లు తెలుస్తోంది.  
-బండి సంజయ్ లీక్ చేశాడంటున్న బీఆర్ఎస్
బండి సంజయ్ ను ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి పలు సంచలన ఆరోపణలు చేశారు.  మంగళవారం వరంగల్లో జరిగిన ఎస్ఎస్సి పరీక్ష పేపర్ లీకేజీకి సూత్రధారిగా బండి సంజయ్ ఉన్నారని బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ మంత్రులు నేతలు ఆరోపిస్తున్నారు. "వరంగల్లో జరిగిన ఎస్ఎస్సి పరీక్ష ప్రశ్నపత్రం లీక్లో ప్రధాన నిందితుడు ప్రశాంత్ ఇప్పుడు జర్నలిస్టు కాదు బిజెపి కార్యకర్త. పరీక్షకు ఒకరోజు ముందు సంజయ్ తనతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా ప్రశ్నపత్రం లీక్ అయ్యేలా చూడాలని సూచించాడు'' అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల ద్వారా రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు ఇబ్బందులకు గురిచేయాలని ప్లాన్ చేశాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్పై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సంజయ్ ఆధ్వర్యంలోనే వరంగల్ ప్రశ్నపత్రం ఇష్యూ నిందితుడు ప్రశాంత్ ఎస్ఎస్సీ హిందీ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి రాజకీయ మైలేజీని పొందాలని సంజయ్ ప్రయత్నిస్తున్నారు. అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి'' అని కోరారు.బీజేపీ చేస్తున్న ఇలాంటి చౌకబారు వ్యూహాలకు బలి కావద్దని విద్యార్థులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం పరువు తీసేందుకు బీజేపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా బురదజల్లుతున్నారని అన్నారు. "టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ ఇష్యూ అయినా ఎస్ఎస్సీ ప్రశ్నపత్రం లీక్ అయినా బీజేపీ కార్యకర్తలు అలాంటి నేరాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇదంతా చేస్తున్నారు'' అని ఆయన అన్నారు. ఈ వ్యూహాలన్నింటి వెనుక ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఉందని... బిజెపి పన్నాగాలను బట్టబయలు చేస్తామని సుమన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు బిజెపి నాయకులు ప్రశ్న పత్రాలను లీక్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం   ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారని ఆరోపించారు.
-ఖండించిన బీజేపీ.. రంగంలోకి బీజేపీ పెద్దలు
బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. పరిస్థితులు అరెస్ట్ కు గల కారణాలను తెలియపరిచారు. తెలంగాణ పోలీసులు సంజయ్ పైన నమోదు చేసిన కేసులను పేర్కొన్నారు. డీజీపీతోనూ కిషన్ రెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. ఇక ప్రధాని నరేంద్రమోడీ సైతం తెలంగాణ బీజేపీ చీఫ్ అరెస్ట్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్ట్ ను తప్పు పట్టారు. కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు.ప్రధాని నరేంద్రమోడీ ఈణెల 8న తెలంగాణకు రాబోతున్నారు. ఈక్రమంలోనే పేపర్ లీక్ ల విషయం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఈకేసులో బండి సంజయ్ అరెస్ట్ తో కేసు మలుపుతిరిగింది. మరి ఈ లీక్ చేసిన వారు ఎవరు? ఇందులో బండి సంజయ్ పాత్ర ఎంత ఉందన్నది.

బండి సంజయ్ పై కేసు.. అమిత్ షా ఆరా..!
బండి సంజయ్ పై సీఆర్పీసీ 154 157 కింద కేసులు నమోదు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కరీంనగర్ లో నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ పరిణామాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ చర్యను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసిన కేంద్రహోంమంత్రి అమిత్ షా అసలు ఏం జరిగిందన్నది ఆరాతీసినట్టు సమాచారం. సంజయ్ పై కేసు.. అరెస్ట్ పరిణామాలను ఆరా తీసినట్టు సమాచారం. సంజయ్ అరెస్ట్ కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలని రాష్ట్ర బీజేపీ నేతలను అధిష్టానం ఆదేశించింది.బండి సంజయ్ ను నిన్న హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు అనంతరం వరంగల్ కు మార్చారు. బొమ్మల రామారం పీఎస్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కాసేపట్లో హన్మకొండ కోర్టులో హాజరుపరుచనున్నారు.
బండి సంజయ్ పై కమలాపూర్ పీఎస్ లో పేపర్ లీకేజీ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కమలాపూర్ హెడ్ మాస్టర్ శివప్రసాద్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద బండి సంజయ్ పై ఐపీసీ 420 సెక్షన్ 4 (ఏ) 6 టీఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 66-డీ ఐటీఏ 2000-2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
-ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు..
బండి సంజయ్ పై నమోదైన కేసులో ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు పోలీసులు చేర్చారు. బండి సంజయ్ పై సీఆర్పీసీ 154 157 కింద కేసులు నమోదు చేశారు. నిందితుల జాబితాలో ఏ5గా బండి సంజయ్ పేరు చేర్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వెనుక బండి సంజయ్ కుట్ర ఉందని పోలీసులు పేర్కొన్నారు.అంతేకాకుండా ఎగ్జిమినేషన్ సెంటర్ల వద్ద ధర్నాలు చేసేందుకు ఆయన కుట్రపన్నారని అందులో ప్రస్తావించారు. ప్రశాంత్ తో కొంతకాలంగా కాంటాక్ట్ లో ఉన్న బండి సంజయ్ వాట్సాప్ లో సమాచారం వైరల్ చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు.-ఆరాతీసిన కేంద్రహోంమంత్రి అమిత్ షా బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి స్వయంగా కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. బండి సంజయ్ అరెస్ట్ పరిస్థితులు అరెస్ట్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  తెలంగాణ పోలీసులు సంజయ్ పైన నమోదు చేసిన కేసులను పేర్కొన్నారు. డీజీపీతోనూ కిషన్ రెడ్డి మాట్లాదారు. ఇక ప్రధాని నరేంద్రమోడీ సైతం తెలంగాణ బీజేపీ చీఫ్ అరెస్ట్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.  

బండి అరెస్ట్...మోడీ ఆరా
కుట్ర కేసు నమోదు
తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బండి సంజయ్ అరెస్టుపై అధిష్టానం సీరియస్ అయింది. బండి సంజయ్ అరెస్టు గురించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరాతీశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలతో జేపీ నడ్డా మాట్లాడారు.న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా నాయకులకు సూచనలిచ్చారు.బండి సంజయ్ ప్రధాని మోడీతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయ్యారు. మోడీతో భేటీ అనంతరం విడిగా నడ్డా, షా సమావేశమయ్యారు. బండి సంజయ్ అరెస్టు, తెలంగాణలో పరిస్థితుల గురించి ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు గురించి ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా చర్చించినట్టు సమాచారం.బండి సంజయ్ పై కుట్ర కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ను పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం అక్కడి నుంచి హనుమకొండ తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అనంతరం ఆయన్ను జడ్జి ఎదుట హాజరుపర్చారు.బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్నారని పోలీసులు సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు వరంగల్ లో బండి సంజయ్ పై కేసు నమోదైంది. కేసును బొమ్మలరామారం నుంచి వరంగల్ కు బదిలీ చేయనున్నట్లు పేర్కొంటున్నారు. అయితే, మొదట బొమ్మలరామారం నుంచి బండి సంజయ్ ను వరంగల్ కు తరలించనున్నట్లు పేర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత కాన్వాయ్ ఆలేరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బండి సంజయ్ వ్యవహారంలో పోలీసులు సిక్రెట్ గా వ్యవహారిస్తున్నారు.

బండి అడ్డంగా దొరికిపోయాడు
మంత్రి కేటీఆర్
పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో తెలంగాణలో కుట్రలకు తెరలేపారన్న కారణంతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్‌ఎస్ లీడర్లు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. పిచ్చోడి చేతిలో రాయి వచ్చి పోయేటోళ్లకి ప్రమాదం అని.. అలాగే అదే పిచ్చోని చేతిలో ఓ పార్టీ జెండా ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్థుల, నిరుద్యోగులు జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని వివరించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ వెనుక ఉన్నత్రధారి బీజేపీ కరుడుకట్టిన కార్యకర్త అని, బండి సంజయ్ ముఖ్య అనుచరుడు అని తెలిపారు. పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాకపోతే.. అతడిని విడుదల చేయాలంటూ బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తోందని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ ఘటనపై బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందన్నారు. మధ్యాహ్నం పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని ధర్నా చేసిన నాయకులు... సాయంత్రం పేపర్ల లీకేజీకి పాల్పడి అరెస్ట్ అయిన నిందితుడిని విడుదల చేయాలని కోరడం దారుణం అన్నారు. వాళ్ల ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ... బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు బండి సంజయ్ కు కొన్ని ప్రశ్నలు వేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్ చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్తనేనా కాదా అని ప్రశ్నించారు. నిందితుడు బండి సంజయ్ కు ప్రశ్నా పత్రాన్ని పంపింది కూడా నిజమా కాదా అని అడిగారు. రెండు గంటల్లోనే 142 సార్లు ప్రశాంత్ ఫోన్లు మాట్లడగా.. అందులో బండి సంజయ్ కు చేయడం కుట్ర కాదా అని నిలదీశారు.  పని గట్టుకొని ప్రశ్నాపత్రాలు లీక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది బీజేపీ నేతలేనని... ఇదంతా బండి సంజయ్ ఆధ్వర్యంలోనే జరిగిందని అన్నారు. ప్రశ్నాపత్రం వ్యాప్తిలో బండి సంజయ్ ప్రమేయం లేకపోతే నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచారో సమాధానం చెప్పాలన్నారు. అలాగే రోజుకో ప్రశ్నాపత్రం లీకేజీ పేరుతో కుట్రలు పన్నింది నిజమా కాదా అని నిలదీశారు. సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పోస్టులు పెట్టింది కూడా బీజేపీ కార్యకర్తలే అని చెప్పుకొచ్చారు.  

Related Posts