YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీమ్ బీ ముద్ర చెరిగిపోయేదెలా...

టీమ్ బీ ముద్ర చెరిగిపోయేదెలా...

విజయవాడ, ఏప్రిల్ 6, 
ఏపీ బీజేపీ ఇరకాటంలో ఉందా? ఓ వైపు వైసీపీ, బీజేపీ ఒకటేనన్న అభిప్రాయం జనంలో ఉందన్న బాధ, అదే టైంలో వైసీపీ కనీసం తమను పట్టించుకోవడం లేదన్న అసహనంతో ఆ పార్టీ నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? నిన్న అమరావతిలో గొడవ జరిగి తమ పార్టీ నాయకుడు ఇబ్బందిపడ్డా… దానికి బీజేపీకి సంబంధం లేదని వైసీపీ నేతలు చెప్పడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందా? అధికార పార్టీ కనీసం తమను ఒక పక్షంగా గుర్తించడంలేదని ఏపీ కాషాయదళం కస్సుమంటోందా?నానాటికీ తీసికట్టు.. నాగంబొట్టు అన్నట్టుగా మారింది ఏపీ బీజేపీ పరిస్థితి. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువగా అవమానకర రీతిలో ఓట్లను సాధించుకుంది. అభ్యర్థులందరూ డిపాజిట్స్‌ కోల్పోయారు. అయినా కేంద్రంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంతో ఏపీ బీజేపీ నేతల మాటలను ప్రజలు కాస్తో కూస్తో వింటున్నారు. ఈ క్రమంలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగొచ్చనే అంచనాలకు విరుద్ధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేనతో పొత్తులో ఉన్నా.. ఆ పార్టీ అంతా తూచ్ అన్నట్టుగా వ్యవహరం నడుస్తోంది. విడాకులు తీసుకునే ముందు భార్యా భర్తల మధ్య ఎంత సఖ్యత ఉంటుందో.. జనసేన-బీజేపీ మధ్య ఇప్పుడు అంతే సఖ్యత ఉందన్న చర్చ నడుస్తోంది. అందుకే జనంలోకి వెళ్లి.. సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నాల మీద ఫోకస్ పెట్టింది ఏపీ బీజేపీ.సొంత బలం పెంచుకునే క్రమంలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లను.. కో-కన్వీనర్లను ప్రకటించింది ఏపీ బీజేపీ. వీరి ద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టారు ఏపీ బీజేపీ పెద్దలు. ఈ క్రమంలో ప్రజా పోరు రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. అలాగే జగన్ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ వేసి.. గట్టిగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దామని స్కెచ్ రెడీ చేసుకున్నారు నేతలు. ఈ విధంగా చేస్తే.. వైసీపీ-బీజేపీలు ఒకటేననే రీతిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని పొగొట్టే ప్రయత్నం చేయొచ్చనేది బీజేపీ నేతల భావన. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చెందడంతో కొందరు సీనియర్ నేతలు.. వైసీపీ-బీజేపీ ఒకటేననే భావన ప్రజల్లో బలంగా ఉందని.. అందుకనే తమను ప్రజలు నమ్మడం లేదని బహిరంగంగానే చెప్పేశారు. ఈ క్రమంలో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తాము వైసీపీపై యుద్దమే చేస్తున్నామని చెప్పుకోవచ్చని బీజేపీ ఏపీ నేతలు ఆలోచన చేశారు.వైసీపీ-బీజేపీ ఒకటేనన్న మచ్చను చెరిపేసుకునే క్రమంలో ఈ తరహా కార్యక్రమాలకు సిద్దమమవుతోంటే.. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం స్థానిక బీజేపీ నేతలను సంకటంలోకి నెట్టేస్తున్నట్టే కన్పిస్తోంది. ఢిల్లీలో సీఎం జగన్ ప్రభుత్వ పెద్దలను ఒకటికి రెండు సార్లు కలవడం.. భేటీలు నిర్వహించడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. సీపీఐ నేత నారాయణ వంటి వారు చేస్తున్న కామెంట్లు ఏపీ బీజేపీ నేతల్ని ఇరకాటంలో పెడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. వైసీపీకి పూర్తిగా బీజేపీ హైకమాండ్ అన్ని రకాలుగా సహకరిస్తోందనే భావన ప్రజల్లోకి మరింతగా వెళ్లే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది.దీనికి తోడు అమరావతిలో జరిగిన పరిణామాలు బీజేపీ-వైసీపీ ఓ తాను ముక్కలేననే వాదనకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. తమపై వైసీపీ నేతలు దాడి చేశారని.. అరాచకం సృష్టించారని బీజేపీ మండిపడుతూ.. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తే.. వైసీపీ మాత్రం బీజేపీకి క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ ఇస్తోంది. తాము అసలు బీజేపీ మీద దాడి చేయలేదని.. చంద్రబాబు ప్రోద్బలంతో వచ్చిన.. ఆదినారాయణ రెడ్డి మనుషులే మూడు రాజధానుల టెంట్‌ మీదకు వచ్చి దాడి చేశారని వైసీపీ అంటోంది. ఇదే అంశాన్ని ఎంపీ నందిగం సురేష్‌ కూడా స్పష్టం చేస్తున్నారు. స్వతహాగా బీజేపీ ఇలాంటి దాడులకు పాల్పడదని.. చంద్రబాబు వెనుకుండి ఆదినారాయణ రెడ్డితో ఈ తతంగం నడిపించారనేది నందిగం సురేష్‌ మాటల సారాంశం. ఈ క్రమంలో దాడుల వంటి సంఘటనల్లో కూడా బీజేపీని తప్పు పట్టడానికి వైసీపీ ముందుకు రావడం లేదంటే.. కచ్చితంగా ఈ రెండు పార్టీలు ఒకటేననే అంశానికి మరింతగా బలం చేకూర్చినట్టు కాదా..? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

Related Posts