YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వై నాట్ పులివెందుల....

వై నాట్ పులివెందుల....

కడప, ఏప్రిల్ 6, 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది శాంపిల్ గెలుపు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో పెద్ద విజయం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన టీడీపీ జోనల్ వారీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 20 రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించినా ప్రజలు మద్దతు పలికి గెలిపించారని సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ అంటున్నట్లు వై నాట్ 175 కాదు...ఇప్పుడు చెపుతున్నా వై నాట్ పులివెందుల అని  చంద్రబాబు ప్రకటించారు.  ఎప్పుడు కూడా మనిషి అనేవాడు భూమి మీద నడవాలి..కానీ జగన్ ఆకాశంలో నడిచాడు. పరదాల చాటున నడిచాడు. నాకు అడ్డం లేదు అనుకున్నాడు. అడ్డదారులు తొక్కాడన్నారు.  తెలుగు దేశంతో పెట్టుకున్న జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతారని స్పష్టం చేశారు.
పార్టీ ఎమ్మెల్యేలను జగన్ నిన్నటి వరకు హీనంగా చూశాడు..ఇప్పుడు వారికి గౌరవం ఇస్తాను అంటున్నాడు రాజకీయ పార్టీలపై కేసులు పెట్టడం, శుక్రవారం వస్తే ప్రజల ఆస్తుల మీదకు ప్రొక్లైనర్లు పంపడం చేశాడు. తప్పుడు పనులు చేసిన జగన్ కు మొన్నటి ఎన్నికలు గుణపాఠం చెప్పారన్నారు.  మొన్నటి వరకు 80 మంది ఎమ్మెల్యే లను తీసేస్తాను అన్నాడు...ఇప్పుడు బాబ్బాబు అంటున్నాడు. జగన్ కు వెన్నెముకలో వణుకు పుట్టిందని...  ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచే పార్టీ టీడీపీ అని తెలిసిపోయింది. అందుకే జగన్ లో వణుకు పుడుతోంద్నారు.  మొన్న జరిగిన ఎన్నికల్లో వచ్చిన తీర్పుకు కూడా జగన్ వక్రభాష్యం చెబుతున్నాడని..  ఓటమిని ఒప్పుకోని మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.  ప్రజలను బటన్ బ్యాచ్ అని జగన్ ప్రజలను అవమానించారని..   ప్రజల డబ్బులు ప్రజలకు పంచి లబ్దిదారులను బటన్ బ్యాచ్ అన్నాడని మండిపడ్డారు.   తెలుగు దేశం దేశంలో చక్రం తిప్పిన పార్టీ. నాడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన ఘనత ఉన్న పార్టీ టీడీపీ. ఒక ప్రాంతీయ పార్టీ సాధించిన ఘనత అదన్నారు.. నీతి నిజాయితీ ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర అని చంద్రబాబు ప్రశంసించారు.   ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర ప్రజలే ఎన్నికల్లో కర్రు కాల్చి జగన్ కు వాత పెట్టారు.. హుద్ హుద్ వచ్చినప్పుడు ఇక్కడే మకాం వేసి సాయం అందేలా చేశా. తిత్లీ వస్తే...ఆ ప్రాంతం కోలుకున్న తరువాతనే అక్కడ నుంచి వెళ్లానన్నారు.  నాలుగేళ్లు అయ్యింది....ఈ జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశాడు చెప్పగలడా? అని ప్రశ్నించారు.  టీడీపీ గెలిచి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం పూర్తి అయ్యేవన్నారు.  వంశధార నాగావళి అనుసంధానం పూర్తి అయ్యి ఉంటే ఈ మూడు జిల్లాల్లో నీటి ఎద్దడి లేకుండా ఉండేదని  గుర్తు చేశారు  రాష్ట్రానికే తమానికం అయిన గీతం విద్యాసంస్థను  కూల్చడానికి జగన్ ప్రొక్లెయిన్ తీసుకుని వెళ్లాడని..  విశాఖలో ఐఐఎం పెట్టాం, ట్రైబల్ యూనివర్సిటీ కేటాయించాం. కానీ ఈ సిఎం రంగులు వేసుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. రిషికొండకు మనం వెళతాం అని ప్రభుత్వం భయపడుతుంది. మనం వెళ్లకుండా అడ్డుపడుతుంది. రఘరామ రెడ్డి అనే ఐపిఎస్ అధికారి ఆదేశాలతో అడ్డంకులు సృష్టించారు. వీళ్లు మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు.  నాడు భోగాపురం విమాశ్రయం కోసం 97 శాతం భూ సేకరణ పూర్తి చేశాం. నాలుగేళ్లు అయ్యింది జగన్ ఒక్క ఇటుక వెయ్యలేదన్నారు.  మళ్లీ టీడీపీ వస్తుంది....భోగాపురం పూర్తి చేస్తుందని ప్రకటించారు.  నాడు విశాఖలో మెడ్ టెక్ జోన్ తీసుకువచ్చాం. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కంపెనీ నీ తెస్తే దాన్నీ ఈ ప్రభుత్వం తరిమేసింది.  విశాఖలో 5 ఏళ్లలో మూడు సార్లు సిఐఐ సదస్సులు పెట్టాం. 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నామన్నారు.  పోలవరం ముంపు బాధితులకు డబ్బులు ఇవ్వలేదు, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టును జగన్ పూర్తి చెయ్యలేదు. ఆశోక్ గజపతి రాజు కుటుంబం ప్రజలకు భూములు ఇచ్చారు. మన్సాస్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తిని సింహాచలం ట్రస్ట్ చైర్మన్ పోస్టునుంచి దించేశారు. ఆశోక్ గజపతి రాజును అవమానించారు. అవినీతి ఆరోపణలు చేశారు. అనేక అడ్డంకులు సృష్టించారని చంద్రబాబు మండిపడ్డారు. ఏజెన్సీ నుంచి దొంగ దారిన లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వి తీసుకువెళుతున్నారు. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం, నెంబర్ 2 మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.  నాడు మద్య పాన నిషేదం చేస్తాను అని ఇప్పుడు జగన్ మాట మార్చాడా లేదా అని ప్రశఅనించారు.  వివేకా హత్య జరిగితే నారాసుర రక్త చరిత్ర అని మనపై ఆరోపణలు చేశాడు ఇప్పుడు గూగుల్ టేకవుట్ ద్వారా మొత్తం బండారం బయట పడిందన్నారు.  ఒక్క విశాఖపట్నంలోనే రూ. 40 వేల కోట్లు ఆస్తులు  బెదిరించి, గన్ పెట్టి ప్రజల ఆస్తులు రాయించుకున్నారని మండిపడ్డారు.  కార్తీక వనం ఏమయ్యింది....ప్రేమ సమాజం భూములు ఏమయ్యాయి...దసపల్లా భూములుఏమయ్యి....హైగ్రీవ భూములు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు.  జగన్ రెడ్డీ నీ బంధువు అనీల్ రెడ్డికి విశాఖలో ఏంపని...ఇక్కడ ఓవ్యక్తికి చెందిన 50 ఎకరాల భూమి కొట్టేశాడని..   మా హయాంలో ఎప్పుడూ భూ కబ్జాలు లేవని గ ుర్తు చేశారు.దేశంలో రిచ్చెస్ట్ సిఎంగా ఉన్న జగన్....తాను పేదల మనిషి అంటున్నాడు....వర్గ పోరు అని కొత్త మాటలు చెపుతున్నాడు.  జగన్ మా భవిష్యత్ అని ఇప్పుడు స్టిక్కర్లు వేస్తారట. జగన్ మన భవిష్యత్ కాదు. జగనే మన దరిద్రం. మనకు శాపం అన్నారు.   పట్టబద్రుల ఎన్నికల్లో తిరుగుబాటు.....వచ్చే ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు అవుతుందన్నారు.  మేం 175 పోటీ చేస్తామా లేదా అనేది మీకు ఎందుకు చెప్పాలి. మేం 175లో వైసీపీని ఓడిస్తాం. పులివెందులలో కూడా జగన్ ను ఓడిస్తమని ప్రకటించారు.  అచ్చెన్నాయుడు తో మొదలు పెట్టి అందరిపై తప్పుడు కేసులు పెట్టారు. ఎన్నికేసులు పెట్టినా క్యాడర్, లీడర్లు భయపడలేదు. ఎన్నికేసులు పెట్టినా పార్టీ పోరాటం ఆగదని ప్రకటించారు.  మొదటి ప్రాధాన్యం పార్టీలో ముందు నుంచి ఉన్నవారికే...ఆ తరువాతనే పార్టీలో చేరే వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.  క్యాండెట్ ఎవరు అనేది కాదు...జెండా గెలవాలి అని చూడండని పిలుపునిచ్చారు.

Related Posts