YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

వైరల్ గా మారిన చంద్రబాబు, రాహుల్

వైరల్ గా మారిన చంద్రబాబు, రాహుల్

ఇప్పుడు సోషల్ మీడియా లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎపి సీఎం చంద్రబాబు చంద్రముఖి వీడియో హల్చల్ చేస్తుంది. కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన బాబు అక్కడ రాహుల్ తో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. అంతే కాదు ఆయన భుజంపై చెయ్యి వేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఆ వీడియోను కొందరు చంద్రముఖి సినిమా బిట్ తో కలిపారు. సినిమాలో ప్రభు భార్య జ్యోతిక చంద్రముఖి గా పూర్తిగా ఎలా మారిపోయిందో చూడు అంటూ రజనీకాంత్ చూపిస్తారు.ఆ సీన్ లో బాబు, రాహుల్ లు కలిసి ఫోజు ఇచ్చిన వీడియో ఉంచి పూర్తిగా కాంగ్రెస్ వాదిగా మారిన చంద్రబాబు ను చూడు అనగానే రా రా అంటూ సీన్ ముగించారు. మంచి హాస్యంతో కుడి ఉండటంతో ఈ బిట్ ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా వైసిపి, జనసేన, బిజెపి గ్రూప్ సభ్యులు పెద్ద ఎత్తునే దీన్ని షేర్ చేస్తూ తెలుగు తమ్ముళ్లకు షాక్ ఇస్తున్నారు. దీంతో బాటు మోడీ తో 2014 లో బాబు ఒకే వేదికపై అభివాదం చేస్తున్న బిట్ జోడించారు. నాడు…..నేడు అంటూ చంద్రబాబు రాజకీయ అస్పష్టతను తెలియచెప్పే ప్రయత్నం ప్రత్యర్ధులు గట్టిగానే ఎత్తి చూపారు. అవసరాన్ని బట్టి ఎవరితోనైనా అయన కలిసే స్వభావం ఉందని ఆయన చెప్పే మాటలకు చేసే చేష్టలకు పొంతన ఉండదని ఒక్క ముక్కలో చెప్పేశారు. బాబు, రాహుల్ పై వచ్చిన ఈ వీడియో వైరల్ గా సర్క్యులేట్ కావడమే కాదు జనంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Related Posts