కడప
మార్గదర్శిపై రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని ఏపీసీసీ నేత తులసి రెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడాతూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అత్యంత విశ్వసనీయత కలిగిన సంస్థ. గత ఆరు దశాబ్దాలుగా కొన్ని లక్షల సామాన్య ,మధ్యతరగతి కుటుంబాలకు పొదుపును ప్రోత్సహించి ,తక్కువ వడ్డీతో నిధులు సమకూరుస్తూ ఉన్నటువంటి సంస్థ. 3000 మందికి ఉపాధిని కల్పిస్తూ, ప్రభుత్వాలకు 1325 కోట్ల రూపాయల పన్ను చెల్లిస్తూ ,18 కోట్ల రూపాయలతో సామాజిక బాధ్యత కార్యక్రమాలను నిర్వహించిన సంస్థ ఇది. అక్రమ కేసులు బనాయించి మార్గదర్శిని వేధించడం దుర్మార్గమని అన్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ఉంది వైకాపా ప్రభుత్వ వాలకం. ఆవు, దూడ బాగుండగా మధ్యలో గుంజ కొచ్చింది గురక రోగం అన్నట్లుంది వైకాపా వ్యవహార శైలి. ప్రజాస్వామ్యవాదులు కక్ష సాధింపును హర్షించరు. నట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు.