YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మోదీ ప్రసంగంపై కేసీఆర్ రియాక్ట్ కాకపోవడం వెనుక అసలు కథ?

మోదీ ప్రసంగంపై కేసీఆర్ రియాక్ట్ కాకపోవడం వెనుక అసలు కథ?

హైదరాబాద్ ఏప్రిల్ 10
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఫరేడ్ గ్రౌండ్ వేదికగా కేసీఆర్ సర్కార్‌పై మాటల తూటాలు పేల్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్, బీఆర్ఎస్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా ఓ రేంజ్‌లోనే విమర్శలు గుప్పించారు. ఈ మధ్య బహిరంగ సభల్లో రాజకీయ విమర్శలు పెద్దగా చేయని ప్రధాని.. హైదరాబాద్ సభలో కూడా పెద్దగా పాలిటిక్స్ ప్రస్తావన తీసుకురాకపోవచ్చని బీజేపీ కార్యకర్తలు, నేతలు భావించారు. అయితే కమలం పార్టీ కార్యకర్తలు, నేతలకు ఊహకందని రీతిలో కేసీఆర్ సర్కార్‌‌ను కడిగిపారేశారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చినట్లయ్యింది. కుటుంబ పాలన, తెలంగాణ ప్రభుత్వం అవినీతి పాలన ఆఖరికి దర్యాప్తు సంస్థల వరకూ అన్ని విషయాలను ప్రస్తావిస్తూ మోదీ మాట్లాడారు. ప్రధాని తెలుగులో ప్రసంగం ప్రారంభించి మొదలుకుని ముగిసే వరకూ కార్యకర్తలు, అభిమానులు ఎనలేని ఉత్సాహంతో చాలా ఓపిగ్గా విన్నారు. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. ప్రెస్‌మీట్ పెట్టినా, బహిరంగ సభలు పెట్టినా బీజేపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడే ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీ విమర్శలపై.. అది కూడా హైదరాబాద్ వేదికగా ప్రధాని చేసిన కామెంట్స్‌పై ఇంతవరకూ స్పందించనే లేదు. ఏదో ఇద్దరు, ముగ్గురు ముఖ్యనేతలు మినహా ఎవరూ పెద్దగా కౌంటర్లు ఇవ్వలేకపోయారని బీఆర్ఎస్ శ్రేణులు కాస్త అసంతృప్తితో ఉన్నాయట. ఇంతకీ మోదీ విమర్శలపై కేసీఆర్ స్పందిస్తారా..? లేదా సార్ సప్పుడు చేయకుండా సైలెంట్‌గానే ఉండిపోతారా..? ఒకవేళ స్పందిస్తే ఎప్పుడు..? అనేదానిపై అటు బీజేపీలో.. ఇటు బీఆర్ఎస్‌లో ఒకటే చర్చ నడుస్తోంది.
ఏం జరుగుతుందో..!?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్‌ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయన్న విషయం విదితమే. ముఖ్యంగా టీఆర్ఎస్, బీఆర్ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్ అస్సలు ఆగలేదు. ప్రెస్‌మీట్ పెట్టినా.. బహిరంగ సభలు పెట్టిన మోదీ సర్కార్‌ను కడిగిపారేసేవారు. అయితే తెలంగాణలో గత కొన్ని రోజులుగా పెను ప్రకంపనలు రేపే ఘటనలు జరిగాయ్. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కోవడం, ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావడం ఇదంతా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద రచ్చే అయ్యింది. ఇక తెలంగాణలో జరిగిన టీఎస్‌పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకించాయ్. TSPSC పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్‌కు సంబంధం ఉందని ఆరోపించిన వారందరికీ నోటీసులు ఇవ్వడం, ఆఖరికి పరువు నష్టం దావా వేయడం కూడా పెద్ద సంచలనమే. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి టెన్త్ పేపర్ లీకేజీలో పాత్ర ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం రచ్చ రచ్చే అయ్యింది. స్వరాష్ట్రంలో ఇంత జరిగినా, సర్కార్‌పై పెద్ద మచ్చ పడినా ఇంతవరకూ కేసీఆర్ అస్సలు స్పందించనే లేదు. ఇవన్నీ అటుంచితే.. కేసీఆర్ అడ్డాకే వచ్చిన మోదీ పరోక్షంగా ధ్వజమెత్తారు. అవినీతిపరులు జైలుకేనంటూ డైరెక్టుగా సంకేతాలు కూడా ఇచ్చేశారు. అవినీతిపరులను శిక్షించాలా.. వద్దా..? మీరే చెప్పడం అంటూ ప్రజలనే ప్రశ్నించారు ప్రధాని. ఇలా ఒకట్రెండు కాదు కేసీఆర్ సర్కార్ గురించి ఎన్నిరోజులుగా మాట్లాడాలని మోదీ మనసులో పెట్టుకున్నారో కానీ ఫరేడ్ గ్రౌండ్ వేదికగా మొత్తం కక్కేశారు.

Related Posts