YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జేడీఎస్ కు మద్దతుగా బీఆర్ ఎస్

జేడీఎస్ కు మద్దతుగా బీఆర్ ఎస్

బెంగళూరు, ఏప్రిల్ 11, 
వచ్చే నెలలో కర్నాటకలోని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు. ఈసారి కర్ణాటక ఎన్నికల్లో 59 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అవుతానని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.అయితే కాంగ్రెస్‌, బీజేపీలో ఎవరితో పొత్తు పెట్టుకుంటారని విలేకరులు ప్రశ్నించగా..తాము ఏ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేది ముందుగా చెప్పలేమని కుమారస్వామి స్పష్టం చేశారు. జేడీఎస్ ఇప్పటికే 97 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించగా, కాంగ్రెస్ 165 మంది పేర్లను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా కర్ణాటకలో మే 10 న ఎన్నికలు నిర్వహించున్నారు. మే 13 న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

Related Posts