YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అంబేద్కర్ విగ్రాహావిష్కరణకు భారీ ఏర్పాట్లు

అంబేద్కర్ విగ్రాహావిష్కరణకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్, ఏప్రిల్ 11, 
హైదరాబాద్‌ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు గడువు సమీపిస్తుండటంతో ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ పనులను తెలంగాణ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు పరిశీలించారు.ఈనెల 14 న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు, విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ లతో పాటు పలువురు సీనియర్ అధికారులు పరిశీలించారు.విగ్రహావిష్కరణకు కేవలం 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో  అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు వీవీఐపీ లు పాల్గొనే విగ్రహ ఆవిష్కరణకి ఉపయోగించే కర్టెన్, సందర్శకులకు ప్రవేశం, బహిరంగ సభ నిర్వహణ స్థలం తదితర అంశాలను సంబంధిత అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి లు సమీక్షించారు.ఐమాక్స్ పక్కనే ఉన్న మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు దాదాపు 40 వేలకు పైగా ఛైర్లు వేయాలని సూచించారు. వివిధ జిల్లాల నుండి వచ్చే వాహనాల పార్కింగ్, ఆవిష్కరణాంతరం, అంబేద్కర్ విగ్రహాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించనున్నందున తగు క్యూ లైన్లు, పూల ను ఏర్పాటు చేయాలనీ అధికారులను సూచించారు.నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఎస్.సి డెవలప్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్.సి డెవలప్మెంట్ శాఖ కమీషనర్ యోగితా రానా, మల్లేపల్లి లక్ష్మయ్య ఆర్ అండ్ బి అధికారులు పరిశీలించారు.విగ్రహా ఆవిష్కరణ కు సంబంధించి తుది మెరుగులు దిద్దుతూ చివరి దశ పనులు చకాచకా చేస్తున్నారు.హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం.. తెలంగాణకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.అంబేద్కర్ విగ్రహం.. ఎడమ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని.. కుడి చేతిని ముందుకు చాచి చూపుడు వేలుతో గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న బాబాసాహెబ్‌ విగ్రహం నెక్లెస్‌ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం.. మరోవైపు అమరుల స్మారకం, అంబేడ్కర్‌ భారీ విగ్రహం.. హైదరాబాద్ కు మణిహారంగా నిలవనున్నాయి.

Related Posts