విశాఖపట్టణం, ఏప్రిల్ 12,
రెండేళ్లుగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవేటీకరణకు సంబంధించి బిడ్డింగ్ గడువు సమీపిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే BRS ఎంట్రీ.. తెలంగాణ ప్రభుత్వ పెద్దల ప్రకటనలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. అదానీకి కట్టబెట్టేందుకే బయ్యారం గనులను.. విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారని ఆరోపించిన మంత్రి KTR.. కేంద్రం చర్యలను అడ్డుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలపై ప్రశ్నలు లేవనెత్తారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ విషయంలో రూల్ బుక్‌ను బయటకు తీశారు ఏపీ మంత్రి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. మూడు లక్షల మంది ప్రజలు సాక్షిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సీఎం జగన్ గళం వినిపించారు. ప్రధానికి లేఖ రాశారు.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. మా పార్టీ, మా ప్రభుత్వం కార్మికుల పక్షానే ఉందని పేర్కొన్నారాయన.ఈవోఐలో భాగంగా స్టీల్‌ప్లాంట్‌కు సింగరేణి అధికారులు. స్టీల్‌ప్లాంట్ ఫండ్ రైజింగ్‌లో భాగంగా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకొనేందుకు సింగరేణి అధికారులు వైజాగ్ వచ్చారు. ఈ చర్యను ప్లాంట్ రా మెటీరియల్ కాస్ట్ తగ్గించుకునే వ్యూహంగానే చూస్తోంది వైసీపీ.త్తరాంధ్ర సాగరతీరంలో ఏర్పడిన ఉక్కుతుఫాను తెలుగురాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రైవేటీకరణకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే.. రంగంలో దిగిన కేసీఆర్ నేనున్నానంటూ అధికారులను రంగంలోకి దింపారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో పాల్గొనేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అవకాశం ఉంటే మేమే ఆపేవాళ్లమని.. తెలంగాణ ప్రభుత్వమే కాదు అసలు సింగరేణి సంస్థకు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం లేదంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారంలో అసలు దోషి కేంద్రమే అంటూ కేటీఆర్ బైలదిల్లా థీయరీ బయటపెట్టారు.విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. పెట్టుబడుల ఉపసంహరణపై 2002లో కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉంటే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఇచ్చిన కొన్ని సడలింపులనే తెలంగాణ ఆధారంగా చేసుకుంది.