చిత్తూరు
పలమనేరు రూరల్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 7 గంటలకే 22 ఏనుగుల గుంపు చెత్తపెంప గ్రామంలో హల్ చల్ చేసాయి. తరువాత నలగాంపల్లి గ్రామానికి వచ్చి గ్రామంలో చిట్టి నాయుడు అనే రైతుకు చెందిన ఎకరా రాగిపంటను తొక్కి నాశనం చేశాయి. మీదుగా ఈ ఏనుగుల గుంపును అటవీశాఖ అధికారులు గమనించారు. ట్రాకర్స్ కలసి వాటిని తరిమెందుకు చెత్తపెంట నుంచి ఆ తరువాత కోటూరు మీదుగా మండీపేట గ్రామ సమీపంలో సంచరించాయి. ఈ గుంపు ఏనుగులను అష్టకష్టాలు పడి ఏనుగులు పంటలపై వెళ్ళనీయకుండా వూసరపెంట మీదుగా తరలిస్తుండగా అర్దరాత్రి ఆటవీ సిబ్బంది పై తిరగబడ్డాయి. అక్కడనుండి కాలవపల్లికి దొమ్మరపాపమ్మ గుడికి మద్యన పంటపొలాలమీదుగా వాటిని అష్టకష్టాలు పడి ఉదయం 6 గంటలకు గుడియాత్తం రోడ్డు దాటి అడవిలోనికి మళ్ళించారు..