YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అశోక్ గహ్లోట్‌పై నరేంద్ర మోదీ ప్రశంసలు

అశోక్ గహ్లోట్‌పై  నరేంద్ర మోదీ  ప్రశంసలు

వందేభారత్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అశోక్ గహ్లోట్‌పై ప్రశంసలు కురిపించారు.రాజస్థాన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గహ్లోట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు మోదీ. సొంత పార్టీలో అంతర్గత విభేదాలున్నా, వాటిని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు. వందేభారత్‌కు పచ్చజెండా ఊపిన ప్రధాని...ఆ తరవాత కీలక ప్రసంగం చేశారు. ఈ క్రమంలోనే గహ్లోట్‌ను అభినందించారు. గహ్లోట్ డిమాండ్‌లనూ ఈ సందర్భంగా ప్రస్తావించారు. "అశోక్ గహ్లోట్‌కు నా ప్రత్యేక అభినందనలు. ప్రస్తుతం సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు ఎదుర్కొంటున్నారు. ఇంత సంక్షోభంలోనూ ఆయన అవన్నీ పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ప్రశంసనీయం. ఇది కచ్చితంగా స్వాగతించాల్సిన విషయం"
జైపూర్ జంక్షన్ స్టేషన్‌లో వందేభారత్ ట్రైన్ ప్రారంభోత్సవం జరిగింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్‌  రైల్వే బోర్డ్ ఛైర్మన్ కూడా పాల్గొన్నారు. అయితే...రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, రైల్వే బోర్డ్ ఛైర్మన్ ఇద్దరూ రాజస్థాన్‌కు చెందిన వాళ్లే. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఛలోక్తులు విసిరారు ప్రధాని మోదీ. గహ్లోట్ జీ..మీ చేతుల్లో రెండు లడ్డులు పెట్టినట్టుగా ఉందని నవ్వుతూ అన్నారు. "గహ్లోట్ జీ మీ రెండు చేతుల్లో చెరో లడ్డు పెట్టినట్టుగా ఉంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజస్థాన్‌కు చెందిన వారే. రైల్వే బోర్డ్ ఛైర్మన్ కూడా రాజస్థాన్‌ వారే"అశోక్ గహ్లోట్‌తో ఉన్న మైత్రినీ గుర్తు చేసుకున్నారు ప్రధాని. తమ మైత్రిపైన గహ్లోట్‌కు ఎంతో గౌరవం ఉందని కొనియాడారు. "స్వాతంత్య్రం వచ్చిన వెంటనే జరగాల్సిన పనులు ఇప్పటికీ మన దేశంలో పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ మీరు నన్ను చాలా బలంగా నమ్మారు. మీ అభివృద్ధి పనులనూ నా ముందుంచారు. ఇది మీ నమ్మకం. మీ విశ్వాసమే మన మైత్రికి బలం. మన స్నేహంపైన మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు"
-  ప్రధాని నరేంద్ర మోదీ
రాజస్థాన్‌లోని అజ్మేర్‌ నుంచి ఢిల్లీ రైల్వే స్టేషన్ మధ్యలో వందేభారత్  సర్వీస్‌లు అందించనుంది.  ఏప్రిల్ 13 ఈ సర్వీస్ మొదలు కానుంది. అజ్మేర్- ఢిల్లీ మధ్యలో నడవనున్న ఈ ఎక్స్‌ప్రెస్ జైపూర్, అల్వార్, గుడ్‌గావ్ వద్ద ఆగుతుంది. ప్రస్తుతం ఈ రూట్‌లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఈ దూరం కవర్ చేసేందుకు కనీసంర 6 గంటల 15 నిముషాలు పడుతోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఈ ప్రయాణ సమయం గంట మేర తగ్గనుంది. ప్రపంచంలోనే తొలి సెమీహైస్పీడ్ ప్యాసింజర్ ట్రైన్‌ ఇదే. పర్యాటక ప్రాంతాలపైన రాజస్థాన్, పుష్కర్, అజ్మేర్ షరీఫ్ దర్గా ప్రాంతాలకు ఈ ట్రైన్ సర్వీస్‌లు నడవనున్నాయి. ఫలితంగా...ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ట్రైన్‌ అందుబాటులోకి రావడం వల్ల సామాజికంగానే కాకుండా ఆర్థికంగానూ అభివృద్ధి సాధించేందుకు వీలవుతుందని కేంద్రం చెబుతోంది.

Related Posts