న్యూ ఢిల్లీ ఏప్రిల్ 12
సుమారు రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలనానికి తెరదీశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆదేశాలపై హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు కారులో ముట్టజెప్పినట్టు ఇటివలే లేఖ విడుదల చేసిన సుకేష్ తాజాగా మరో బాంబ్ పేల్చాడు. డబ్బు ముట్టజెప్పే విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో వాట్సప్ చాటింగ్ జరిగిందని పేర్కొంటూ పలు వాట్సప్ స్ర్కీన్ షాట్లను అతడు షేర్ చేశాడు. కవితతో చాట్ ఇదేనంటూ సుకేశ్ పేర్కొన్నాడు. ఆమెతో పలుమార్లు చాట్ చేసినట్టు పేర్కొన్నాడు. కేజ్రీవాల్‌ను ఏకే గా, సత్యేంద్ర జైన్‌ను ఎస్జేగా కోడ్ నేమ్‌తో చాటింగ్ చేసినట్టు స్ర్కీన్ షాట్లలో కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ కవిత పేరుతో నంబర్ సేవ్ చేసుకున్నట్టుగా అందులో కనిపిస్తోంది. కాగా షేర్ చేసిన స్ర్కీన్ షాట్ల ప్రకారం చాటింగ్ ఈ విధంగా కొనసాగింది.
సుకేశ్ చంద్రశేఖర్: ఏకే బ్రదర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది
ఎమ్మెల్సీ కవిత : ఓకే
సుకేశ్ చంద్రశేఖర్: దాన్ని నేను JHకు పంపించాలా?
ఎమ్మెల్సీ కవిత : నోనో, అరుణ్‌ను నీకు కాల్ చేయమని చెబుతా. దాన్ని ఆఫీసుకు పంపించాలి.
సుకేశ్ చంద్రశేఖర్: ఓకే అక్కా.. మీరు చెప్పినట్టే చేస్తా.
ఎమ్మెల్సీ కవిత : అతను నీకు త్వరలో కాల్ చేస్తాడు
సుకేశ్ చంద్రశేఖర్: దాన్ని ఈ రోజే మీకు పంపించాలని ఎస్జే బ్రదర్ చెప్పారు
ఎమ్మెల్సీ కవిత : అవును
సుకేశ్ చంద్రశేఖర్: నేను మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటాను అక్కా
ఎమ్మెల్సీ కవిత : అంతా బాగానే ఉంది కదా? నాన్న ఆరోగ్యం ఎలా ఉంది?.
సుకేశ్ చంద్రశేఖర్: అడిగినందుకు థ్యాంక్స్ అక్కా.. కీమో చికిత్స తీసుకుంటున్నారు
ఎమ్మెల్సీ కవిత : ఆయన బయటపడతారు
సుకేశ్ చంద్రశేఖర్ : అవును అక్కా. దేవుడు అనుగ్రహిస్తాడు
ఎమ్మెల్సీ కవిత : టేక్ కేర్, మళ్లీ తర్వాత మాట్లాడతా
సుకేశ్ చంద్రశేఖర్: ఓకే అక్కా, ఎనీటైమ్. కేసీఆర్ కి నా నమస్కారాలు చెప్పండి.
సుకేశ్ చంద్రశేఖర్: అక్కా. సరుకు డెలివరీ అయింది
ఎమ్మెల్సీ కవిత : ఓకే...
సుకేశ్ చంద్రశేఖర్: అక్కా.. దయచేసి ఏకే లేదా ఎస్జే కు తెలియచేయండి
ఎమ్మెల్సీ కవిత : మనీశ్‌తో మాట్లాడా
సుకేశ్ చంద్రశేఖర్: ఓకే అక్కా.. థ్యాంక్స్.