YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మరో వివాదంలో కాణిపాక ఆలయం

మరో వివాదంలో కాణిపాక ఆలయం

తిరుపతి, ఏప్రిల్ 13, 
కాణిపాకం‌ వరసిద్ది‌ వినాయక స్వామి ఆలయంలోని అధికారులు మరోక వివాదంలో చిక్కుకున్నారు. విఘ్నేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులు మూలవిరాట్‌ విగ్రహానికి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వ్యక్తి వైసీపీ నేత అనుచరుడిగా విమర్శలు వినిపిస్తున్నాయి. కాణిపాకం ఆలయం మూలవిరాట్ ఫొటో సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడం కలకలం రేగుతోంది. స్థానికంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాణిపాకం ఆలయం ఏఈఓ, సూపర్డెంట్, టెంపుల్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సత్యప్రమాణాలకు నిలయంమైన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయం చుట్టూ ఈ మధ్య కాలంలో వివాదాలు అలుముకుంటున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు, భక్తులు, హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పాలక పక్ష ఏక పక్ష వైఖరి కారణంగానే వివాదాలు ముసురుకుంటున్నాయన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆలయ అధికారులు, పాలక మండలి కుమ్మక్కే ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని విమర్శ లేకపోలేదు. అధికార పార్టి నేత ఉడా ఛైర్మన్ నల్ల బాలవెంకటరెడ్డి యాదవ్ దంపతులు రెండు రోజుల క్రితం వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఈ దంపతులకు ఘనస్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ టైంలోనే కొందరు వ్యక్తులు మూలవిరాట్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. నల్ల బాలవెంకటరెడ్డి యాదవ్‌తోపాటుగా వచ్చి తన అనుచరుడు దర్శన సమయంలో గర్భాలయంలోని మూలవిరాట్ పోటోలు తీశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆలయ అర్చకులు గానీ, ఆలయ అధికారులు గానీ మూలవిరాట్ ఫోటోలు తీయకూడదని చెప్పడం కానీ అడ్డుకోవడం కానీ చేయలేదు. అంతే ఆ వ్యక్తులు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి కాస్తా వైరల్‌ కావడంతో భక్తులు మండిపడుతున్నారు.. సాధారణంగా ఆలయంలో రాజగోపురం నుంచి అర్ధమండపం వరకు సెక్యూరిటీ సిబ్బంది, ఆలయ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉంటారు. స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి‌ భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. ఆలయంలో సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది. గర్భాలయంలో ఫోటోలు చిత్రీకరిస్తుంటే చూడని సెక్యూరిటీ సిబ్బంది‌ నిర్లక్ష్య కూడా ఇక్కడ కనిపిస్తుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.      

Related Posts