YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో పార్టీలకు అసమ్మతి సెగ

కర్ణాటకలో పార్టీలకు అసమ్మతి సెగ

బెంగళూరు, ఏప్రిల్ 13,
కర్నాటక ఎన్నికల్లో టిక్కెట్లు దొరకని నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. చివరిక్షణంలో తనకు బీజేపీ టిక్కెట్‌ లభిస్తుందన్న ఆశలో ఉన్నారు మాజీ సీఎం జగదీశ్‌ శెట్టార్‌. టిక్కెట్‌ లభించని నేతలు రాత్రికి రాత్రి పార్టీలు మార్చేస్తున్నారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చామని స్పష్టం చేశారు సీఎం బస్వరాజ్‌ బొమ్మై.కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మైండ్‌గేమ్‌ కొనసాగుతోంది. కర్నాటక ఎన్నికల ముందు జంపింగ్స్‌ కహానీలో మరో ట్విస్ట్‌ ఇది. కాంగ్రెస్‌ నేత, మాజీ స్పీకర్‌ తిమ్మప్ప కూతురు రాజనందిని బీజేపీలో చేరారు. తన బిడ్డ పార్టీ మారుతుందని తాను ఊహించలేదన్నారు ఆమె తండ్రి తిమ్మప్ప. దీని వెనక ఏదో ఉందని చెప్పారాయన. అయితే కాంగ్రెస్‌ తనకు టికెట్‌ ఇవ్వలేదనీ, తాను కష్టపడినా గుర్తించకపోవడంతోనే పార్టీ మారినట్లు రాజనందిని చెప్పారు.మరోవైపు ఈసారి కూడా తనకు తప్పకుండా బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందని అంటున్నారు మాజీ సీఎం జగదీశ్‌ శెట్టార్‌. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో జగదీశ్‌ శెట్టార్‌ భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను పోటీ చేస్తానని తెలిపారు. హుబ్లీ నుంచి జగదీశ్‌ శెట్టార్‌కు మళ్లీ పోటీ చేసే అవకాశం కచ్చితంగా లభిస్తుందని తెలిపారు యడియూరప్ప.బీజేపీ టిక్కెట్లు లభించిన నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చామని స్పష్టం చేశారు సీఎం బస్వరాజ్‌ బొమ్మై. బీజేపీ 52 మంది కొత్తవారికి అవకాశం కల్పించింది. దీంతో పార్టీలో అసమ్మతి మొదలైంది. టికెట్ దక్కని నేతలు పార్టీ నుంచి వీడేందుకు సిద్ధమవుతున్నారు.224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరుగుతాయి. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో 52 మంది కొత్తవారికి ఈ సారి అవకాశం కల్పించింది. అయితే ఎన్నికల వేళ సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌. ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో అక్రమ ఓటర్లను చేర్పించారని. బెంగళూర్‌ లోనే 40 వేల మంది నకిలీ ఓటర్ల జాబితాను గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు తెలిపారు.కర్ణాటకలో తొలి అభ్యర్థుల జాబితాను  విడుదల చేసింది బీజేపీ. దీనిపై ఇప్పటికే సెగ మొదలైంది. టికెట్‌ ఎక్స్‌పెక్ట్ చేసిన కొందరు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత, మంత్రి లక్ష్మణ్ సవది పార్టీని వీడారు. తనకు టికెట్ దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన లక్ష్మణ్...బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈయన ఒక్కరే కాదు. మరి కొంత మంది కూడా అసంతృప్తి నేతలున్నారని, వాళ్లు కూడా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు అత్యంత సన్నిహితుడైన లక్ష్మణ్ సవది పార్టీ నుంచి వెళ్లిపోవడం బీజేపీకి గట్టి షాకే ఇచ్చింది. లింగాయత్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన జనసమీకరణలోనూ ఆరితేరారు. అలాంటి వ్యక్తిం పార్టీ వీడడం వల్ల ఆ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశముంది. 2012లో అసెంబ్లీలోనే అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. అప్పట్లో అది వివాదాస్పదమైంది. ఆ తరవాత 2018లో లక్ష్మణ్ కాంగ్రెస్‌ అభ్యర్థిపై పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది రోజులకే కాంగ్రెస్-జనతా దళ్ సెక్యులర్ ప్రభుత్వం కూలిపోయింది. చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరారు. ఈ సారి ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం లక్ష్మణ్‌ను అసహనానికి గురి చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌ పేరు కూడా బీజేపీ లిస్ట్‌లో లేదు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి మంతనాలు జరుపుతున్నారు జగదీష్. కానీ...అధిష్ఠానం మాత్రం టికెట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి..ఈ లిస్ట్ ప్రకటించక ముందే బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నాటు నాటు స్టెప్పులతో ప్రచారాలు, బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు హామీలు ఇలా పార్టీలు ప్రచార స్పీడ్ పెంచాయి. అయితే అభ్యర్థుల కసరత్తు పార్టీలకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. దాదాపు మూడు రోజుల కసరత్తు అనంతరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో 189 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది.  కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ మంగళవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 189 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్కమగ్లూరు స్థానానికి పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారుపై పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, పార్లమెంటరీ బోర్డు సుదీర్ఘంగా చర్చించింది. దాదాపు మూడు రోజుల చర్చల అనంతరం తొలి జాబితా విడుదల అయింది.  

Related Posts