YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీబీసీ ఇండియా పై తాజాగా ఈడి కేసు

బీబీసీ ఇండియా పై తాజాగా ఈడి కేసు

న్యూ డిల్లీ ఏప్రిల్ 13
ప్రముఖ మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ తాజాగా కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో బీబీసీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది. ఈ కేసు విచారణతో భాగంగా ఆర్థిక లావాదేవీల వివరాలను సమర్పించాలని బీబీసీ ఇండియాను ఈడీ ఆదేశించింది. అదేవిధంగా విదేశీ రెమిటెన్సుల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలియజేశాయి.కాగా బీబీసీ ఇండియాకార్యాలయంలో గతంలో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించిన సంగతి విదితమే. అయితే ఆ తనిఖీలను ‘సోదాలు కాదని, సర్వే’ అని అధికారులు తెలిపారు. 
గోద్రామారణకాండ వెను క అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీప్రమేయం ఉందంటూ గతంలో బీబీసీ ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.ఇది జరిగిన కొద్ది రోజులకే ఈ తనిఖీలుచోటుచేసుకోవడం గమనార్హం. గుజరాత్‌ అల్లర్లలో ప్రదాని మోదీ హస్తం ఉందని ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ పేరిట రెండు భాగాలుగా విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. కాగా దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోదీకి క్లీన్‌చిట్‌లభించాక కూడా ఇలా అభాండాలు మోపడమేమిటని భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరంవ్యక్తం చేసింది. 

Related Posts