కోల్ కతా
దేశంలోనే పురాతన మెట్రో సర్వీసు కోల్కతా మెట్రో చరిత్ర సృష్టిం చింది. భారత దేశంలోనే తొలిసారిగా ఓ మెట్రో.. నది కింద వేగంగా దూసు కెళ్లింది. హౌరా నుంచి కోల్కతాలోని ఎస్ప్లానేడ్ వరకు హుగ్లీ నది కింద రైలును నడిపారు. కోల్కతా నగరానికి ఈ రన్ చారిత్రాత్మక ఘట్టమని కోల్క తా మెట్రో జనరల్ మేనేజర్ పి ఉదయ కుమార్ రెడ్డి అభివర్ణించారు. హుగ్లీ నదిలో.. రైలు వెళ్లడం ఇదే తొలిసారని ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది 33 మీటర్ల లోతులో ఉన్న అత్యంత లోతైన స్టేషన్. భారత్లో ఇలా జరగ డం ఇదే తొలిసారి. కోల్కతా నగరానికి ఇది చారిత్రాత్మక ఘట్టం. వచ్చే 7 నెలల పాటు హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు ట్రయల్ రన్ కొనసాగుతుందని తెలిపారు. దీని తర్వాత ప్రజల కోసం రెగ్యులర్ గా ప్రారంభిస్తారు.