YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జేడీయస్ ఆహ్వానం తో చంద్రబాబు వెళ్లారు : మంత్రి యనమల

జేడీయస్ ఆహ్వానం తో చంద్రబాబు వెళ్లారు : మంత్రి యనమల

జేడీఎస్ ఆహ్వానం మేరకే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళ్లారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బీజేపీ, వైసీపీ నేతలపై యనమల ధ్వజమెత్తారు. బెంగళూరులో ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలతో చంద్రబాబు భేటీ అయ్యారని, ఏపీకి జరిగిన అన్యాయంపై వారితో చర్చించారన్నారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ లేదనేది గుర్తుంచుకోవాలన్నారు. ఈ మేరకు అయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు.  కాంగ్రెస్ పిలిచిందని వెళ్లలేదు అనేది గుర్తుంచుకోవాలి. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక చంద్రబాబుదే. దేవెగౌడ,ఐ.కె.గుజ్రాల్ ప్రధాని కావడంలో కీలకపాత్ర చంద్రబాబుదే నని అయన అన్నారు. దేవెగౌడతో సాన్నిహిత్యం,కుమార స్వామి ఆహ్వానం మేరకే బెంగళూరు వెళ్లారు. అందుకే ప్రమాణ స్వీకారంలో భాగం పంచుకున్నాం. ప్రాంతీయపార్టీలు,వామ పక్షాల నేతలతో తన ఛాంబర్ లో చర్చలు జరిపారని అన్నారు. కాంగ్రెస్ మంత్రుల ప్రమాణానికి సోనియా, రాహుల్ హాజరయ్యారు. వేదికపై ఎదురైనప్పుడు అభినందించుకోవడం భారతీయ సంస్కారం. భారతీయ సంస్కారాన్ని కూడా తప్పు పట్టడం బిజెపి, వైసీపి సంస్కృతిఅని అన్నారు. శాసనసభలో జాతీయగీతం వస్తుంటే సభనుంచి వెళ్లిపోవడం యడ్యూరప్ప సంస్కృతి అని విమర్శించారు. కేసుల మాఫీ కోసం కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకోవడం జగన్ సంస్కృతి అని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లలేదు. ఎదురైతే అభినందించడాన్ని తప్పుపట్టడం దివాలాకోరుతనం. ఓట్లకోసం వచ్చిన కోవింద్ కాళ్లు ఏ1,ఏ2 నిందితులు పట్టుకోవడాన్ని ఏమనాలి.? ఢిల్లీలో కేంద్రపెద్దల ఛాంబర్లకు జగన్ వెళ్లి కాళ్లు పట్టుకోవడాన్ని ఏమనాలి..? బెంగళూరు ప్రమాణానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నలు కురిపించారు. కర్ణాటకలో బిజెపికి పనిచేశావు కాబట్టే జెడి(ఎస్) ప్రమాణానికి జగన్ వెళ్లలేదు. ముఖం చెల్లలేదు కాబట్టే జగన్ బెంగళూరు ప్రమాణానికి వెళ్లలేదు. 2019లో బిజెపితో పొత్తుకోసమే జగన్ బెంగళూరు ప్రమాణానికి వెళ్లలేదు. బిజెపితో  తన పొత్తు చెడిపోతుందనే భయంతోనే జెడి(ఎస్) ప్రమాణానికి జగన్ గైర్హాజరయ్యారు. జాతీయ రాజకీయాలలో చంద్రబాబుకున్న ఇమేజి దేశంలో అందరికీ తెలిసిందేనని యనయల అన్నారు. 

Related Posts