YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ లీడర్స్... సౌండ్...

ఏపీ లీడర్స్... సౌండ్...

విజయవాడ, ఏప్రిల్ 14, 
ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నేతలే అత్యంత సంపన్నులు. వారు వ్యాపారాలు చేసి సంపాదించారా? లేక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు కూడబెట్టారా? అన్నది పక్కన పెడితే దేశంలో అత్యంత సంపన్నులైన రాజకీయవేత్తలుగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీడర్స్ ముద్ర పడిపోయారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం తరచూ తెరమీదకు వస్తుంది. అందులో ఎంత నిజముందో తెలియదు కాని కోట్ల రూపాయలు పోసి ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకునేందుకు కూడా రాజకీయ పార్టీ అధినేతలు వెనుకాడరన్నది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్్తో పాటు తెలంగాణలో రాజకీయ పార్టీలు తక్కువేమీ కాదు. అధికారం కోసమో..కాసుల కోసమో చెప్పలేదు కానీ ఇక్కడ కూడా జంపింగ్ జపాంగ్‌లు ఎక్కువగానే కనిపిస్తారు. ఎన్నికలు జరిగిన కొద్ది కాలానికే అధికార పార్టీవైపు మొగ్గు చూపుతుంటారు. తాజాగా అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ జాబితాలోనూ అదే జరిగింది. దేశంలోనే అత్యంత సంపన్నులైన ముఖ్యమంత్రుల్లో జగన్ మొదటి స్థానంలో ఉండగా, అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉండటం విశేషం. ఇక తెలుగుదేశం పార్టీలోనూ పోటీ చేసే వారు అత్యధికంగా ధనవంతులే. గత ఎన్నికల సమయంలో వారు నామినేషన్ సందర్భంగా వేసిన అఫడవిట్‌లోనూ ఇదే విషయం స్పష్టమయింది. ఏపీలో గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య ఆస్తులు 689 కోట్లు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన పొంగూరు నారాయణ కూడా 668 కోట్లతో చంద్రబాబుతో పోటీ పడుతున్నారు. ఇక గత ఎన్నికల్లో అత్యల్పంగా విశాఖ సౌత్ అసెంబ్లీకి పోటీ చేసిన పార్టీ అభ్యర్థి డి.వి. రమణ ఆస్తులు కేవలం మూడు వందల రూపాయలు అని పేర్కొన్నారు. అలాగే పశ్చిమగోదావరిలోని చింతలపూడి స్థానానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి సొంగ గీత ఆస్తులు 428 రూపాయలు మాత్రమే. వినుకొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఉస్తాలా ఆస్తులు 989 రూపాయలేనట. సోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో పాటు సంపన్నులైన ఎమ్మెల్యేల ఆస్తులను కూడా ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్న 510 కోట్ల విలువైన ఆస్తుండగా, చంద్రబాబుకు 650 కోట్ల విలువైన ఆస్తులున్నాయని తేల్చారు. ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్నుడిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే నాగరాజు ఉన్నారు. ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తులున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యేగా నిలిచాడు. ఆ తర్వాత కర్ణాటక పీసీసీ చీఫ్ ప్రెసిడెంట్ డి.శివకుమార్. ఆయన ఆస్తులు 840 కోట్ల రూపాయలు. చంద్రబాబుకు 650 కోట్ల రూపాయల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచాడు. చంద్రబాబు తర్వాత గుజరాత్ కు చెందిన జయంతి భాయ్ సోమా భాయ్ పటేల్ కు ఉన్నారు.ఇది గత ఎన్నికలకు సంబంధించింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతల అత్యంత సంపన్నులు ఉన్నారు. అత్యంత పేదలున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఎప్పుుడూ డబ్బుతోనే ముడిపడతాయని అంచనా వేయడం పొరపాటే. అత్యంత సంపన్నులైన అభ్యర్థులు అనేక సార్లు ఓటమి పాలయిన ఘటనలు చాలా చోట్ల ఉన్నాయి. అందుకే డబ్బు సంపాదించగానే నామినేటెడ్ పదవి దక్కుతుందేమో తెలియదు కాని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదన్నది అనేక సార్లు ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.

Related Posts