YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నాతో నేను ఫస్ట్ లుక్ విడుదల

నాతో నేను ఫస్ట్ లుక్ విడుదల

విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘నాతో నేను’ ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’.  ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్ ఇటీవల ఫిల్మ్ ఛాంబర్లో  విడుదల చేశారు. ‘‘టైటిల్ బావుంది. ఫీల్గుడ్ లవ్స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలని అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ ‘‘మంచి కథతో శాంతికుమార్ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్  వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
దర్శకుడు శాంతికుమార్ మాట్లాడుతూ‘‘ ఓ మంచి కథ రాసి మొదటి నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ నచ్చి వెంటనే అంగీకరించారు. నా తొలి ప్రయత్నానికి సాయికుమార్ గారు అండగా ఉన్నారు. చక్కని సలహా సూచనలు అందిస్తున్నారు. మంచి కథ రాశాను.. దానిని చక్కగా తెరపై చూపిస్తానని, ఆ దిశగా కృషి చేస్తానని చెబుతున్నానని అన్నారు.

Related Posts