YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కదం తొక్కిన కార్మిక సంఘాలు విశాఖలో ఉద్రిక్తత

కదం తొక్కిన కార్మిక సంఘాలు విశాఖలో ఉద్రిక్తత

విశాఖపట్నం
విశాఖ గాజువాకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని ప్రకటించిన 24 గంటల్లోపే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటనకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, పోరాట కమిటీ నాయకులు ఆగ్రహించారు. రొడేక్కిన కార్మిక సంఘాల నాయకులు, ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్దం చేసారు. అడ్డుక్కున్న పోలీస్ లు అరెస్ట్ చేస్తే తప్పుడు ప్రకటన చేసిన కేంద్రమంత్రిని అరెస్టు చెయ్యాలని నినాదాలు చేసా రు.రానున్న ఎన్నికలలో మోడీకీ ప్రజ లు తగిన బుద్ది చెబుతారని సిపిఎం నాయకులు కెఎం శ్రీనివాసురావు అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కార్మికు లు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ సమితి సభ్యుల ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొనసాగుతుందని కేంద్రం చెప్పిన నేపథ్యంలో నిరసన చేపట్టారు. నిరసనకారులు పోలీసులతో వాగ్వా దానికి దిగారు. కూర్మన్న పాలెం జంక్షన్ వద్ద కార్మికులు రోడ్డుపై నిరసన చేపట్టా రు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూర్మన్నపా లెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై కార్మికులు ధర్నాకు దిగారు.ఉక్కు పరి శ్రమ కార్మికులు కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదు పులోకి తీసుకునేందుకు ప్రయత్నించా రు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభు త్వం మొండి వైఖరి వీడకపోతే ఎంతకై నా పోరాడతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

Related Posts