YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్లాంట్ పరిరక్షణ కోసం రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ

ప్లాంట్ పరిరక్షణ కోసం రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ

విశాఖపట్నం
విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటి ఉక్కు సంకల్ప మహా పాదయాత్రను చేపట్టింది. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర కొనసాగింది. దాదా 20 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో కార్మిక సంఘాలు, నిర్వాసితులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్ కొనసాగాలి, సొంత గనులు కేటాయింపు, నిర్వాసితులకు ఉపాధి కలిగించాలని డిమాండ్ చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.విశాఖ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు లక్ష్మీనారాయణ. ఫగ్గన్ సింగ్ ఉక్కు సహాయ మంత్రి కాదని.. ఆసహాయ మంత్రి అంటూ సెటైర్లు పేల్చారు.ఎక్స్‎ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలపై ఛార్టర్డ్ అకౌంటెంట్స్ తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.ఎక్స్‎ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‎లో పాల్గొనేందుకు అన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.స్టీల్‎ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కోసం పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి తానే కోరారని చెప్పారు.ఈ మేరకు స్టీల్ ప్లాంట్‎లో పెట్టుబడుల కోసం తెలంగాణ నిర్ణయం వెనుక తన ప్రమేయం కూడా దోహదం చేసి ఉండవచ్చని అన్నారు.ఇందుకోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఆహ్వానించవచ్చని లక్ష్మీనారాయణ వెల్లడించారు.

Related Posts