తిరుమల గాలిగోపురం వద్ద భక్తుల రద్దీపై సీఎం చంద్రబాబు స్పందించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సమాచారంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తుల రద్దీపై మీడియాలో వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని ముందే అంచనా వేయాలి. దానికి తగ్గట్లుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు భక్తులకు కలుగరాదని అన్నారు. ఎన్నో కష్టాల కోర్చి భక్తులు తిరుమల వస్తారు. కష్టాలు చెప్పుకునేందుకు స్వామివారి దర్శనానికి వస్తారు. భక్తుల సేవే స్వామివారి సేవగా సిబ్బంది,అధికారులు భావించాలని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.
భక్తులకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలన్న ముఖ్యమంత్రి మనం ఉంది భక్తుల సేవ కోసమే అనేది అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు.