YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సుధాకర్ కోమాకుల, చిన్నా పాపిశెట్టి, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ & సుఖ మీడియా ‘’నారాయణ & కో ‘ నుంచి దండక డన్ డన్ పాట విడుదల

సుధాకర్ కోమాకుల, చిన్నా పాపిశెట్టి, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ & సుఖ మీడియా ‘’నారాయణ & కో ‘ నుంచి దండక డన్ డన్ పాట విడుదల

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్,  సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ రోజు ‘’నారాయణ & కో ‘ మ్యూజిక్ జర్నీ స్టార్ చేశారు. ఈ చిత్రం నుంచి దండక డన్ డన్ పాటని విడుదల చేశారు. ఫుల్ పైసా వసూల్ సాంగ్ ఇది. నాగ వంశీ ఈ పాటని క్యాచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని ఫుల్ ఎనర్జిటిక్ గా పాడారు. పూర్ణచారి లిరిక్స్ అందించారు. ఈ పాట కొరియోగ్రఫీ చాలా డిఫరెంట్ గా వుంది. లాటరీ తగిలిన ఆనందంలో ’నారాయణ & కో’ కింగ్స్ లా ఫీలవుతూ రాజుల వస్త్రాధారణలో హంగామా చేయడం ఆకట్టుకుంది. ఈ పాటలో సుధాకర్ కోమాకులతో పాటు , దేవి ప్రసాద్, ఆమని, దాదాపు  ‘నారాయణ అండ్ కో’ అంతా సందడి చేసింది.
సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్  సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్.  రెడ్ సెడార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ , శరద్ గుమాస్టే అసోసియేట్ ప్రొడ్యూసర్.
తారాగణం: సుధాకర్ కోమాకుల, దేవి ప్రసాద్, ఆమని, జై కృష్ణ, పూజ కిరణ్, ఆరతి పొడి, యామిని బండారు, సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్, తదితరులు.

Related Posts