YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ రిజల్ట్స్‌పై క్లారిటీ

 తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ రిజల్ట్స్‌పై క్లారిటీ

హైదరాబాద్
తెలంగాణలో టెన్త్, ఇంటర్ పరీక్షా పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియ షురూ అయింది. ఫలితాల విడుదలపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ దిశగా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి. పరీక్షలు అయితే రాసేశాం.. మరి ఫలితాలు ఎప్పుడూ.. ? ఇప్పుడు విద్యార్థుల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ప్రజంట్ తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఫలితాల వాల్యువేషన్ కొనసాగుతోంది. ఎంసెట్‌తో పాటు ఇతర పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి…. మే 10వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ప్రజంట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. ఇంటర్ పుస్తకాలు పక్కనబెట్టి ఇక ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. 2023 -24 అకడమిక్‌ క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవుల తర్వాత జూన్‌ 1 నుంచి ఇంటర్‌ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందని బోర్డు వెల్లడించింది.ఇక ఏప్రిల్ 11న పరీక్షలు ముగియగా..  ఏప్రిల్ 14 నుంచి పదో తరగతి పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 18 సెంటర్లలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 21వ తేదీ వరకు వాల్యుయేషన్ కంప్లీట్ చేసి… అనంతరం టేబులేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇందుకోసం మరో 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే..మే 15 టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల చేసే అవకాశం ఉంది. https://bse.telangana.gov.in/ ఈ లింక్ పై క్లిక్ చేసి మీ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కాగా ఈ సారి  రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం రెగ్యుల‌ర్ విద్యార్థులు 4,86,194 మంది పరీక్షల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా… వీరిలో 4,84,384 మంది అటెండ్ అయ్యారు.టెన్త్ పరీక్షలకు సంబంధించి కాపీయింగ్ కు పాల్పడిన 16 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కింద అధికారులు చర్యలు తీసుకున్నారు.  విధుల్లో అలసత్వం వహించిన 18 మంది టీచర్లపై చర్యలు తీసుకున్నారు. పేపర్ లీక్ వంటి అంశాలు కుదిపేసిన నేపథ్యంలో.. విద్యాశాఖ పరీక్షా కేంద్రాల వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Related Posts