దేశంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతాయి,48 గంటల నిరవధిక సమ్మె ఉంటుంది
బ్యాంకు రుణాలు ఎగ్గొడుతున్న అవినీతిపరుల తీరును నిరసిస్తున్నాం అని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు అన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు 48 గంటలపాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు వేతన సవరణ గురించి వారు మాట్లాడుతూ, ఉద్యోగులను విభజించి చేస్తున్న పే సెటిల్మెంట్ కు తాము వ్యతిరేకమని అన్నారు. రెండు శాతం మాత్రమే చేశారని, పదిహేనుశాతం వేతనాన్ని సవరణ చేయాల్సి ఉండగా బ్యాంకర్ల పరిస్థితి బాగోలేదని చెప్పడం దారుణమని అన్నారు.