తమిళనాడు : తూత్తుకుడి కాల్పులకు నిరసనగా అసెంబ్లీ వద్ద డీఎంకే నేతలు ధర్నా చేసారు. డీఎంకే శ్రేణులు భారీగా తరలి వచ్చారు . ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. పెద్ద సంఖ్యలో డీఎంకే శ్రేణులు అసెంబ్లీ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొంది. దీంతో, స్టాలిన్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో, అక్కడ పోలీసులకు-డీఎంకే శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు, రేపు తమిళనాడు బంద్ కు డీఎంకే పిలుపునిచ్చింది.