YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ట్రస్టులకు ప్రాపర్టీ టాక్స్ వుండదు : మంత్రి కేటీఆర్

ట్రస్టులకు ప్రాపర్టీ టాక్స్ వుండదు : మంత్రి కేటీఆర్

ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ను అవగాహనతోనే నిర్మూలించొచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు.హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో గురువారం  అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను  అయన  ప్రారంభించారు.   మంత్రి  మాట్లాడుతూ బాలకృష్ణ తన ఇష్టమైన నటుడు అని పేర్కొన్నారు. బసవతారకం ఆస్పత్రి ఇంతగా అభివృద్ధి కావడం గర్వకారణమన్నారు. సెలబ్రిటీలు కూడా స్వచ్ఛందంగా అవగాహన కార్యక్రమాలు చేయాలన్నారు.  తల్లిదండ్రులు గర్వపడే విధంగా నట వారసత్వాన్ని తీసుకెళ్లడమే కాకుండా తల్లి పేరుతో ప్రారంభించిన ఆస్పత్రిని ఉన్నత స్థాయికి తీసుకురావడం గర్వకారణమని బాలకృష్ణలను కొనియాడారు. బాలకృష్ణ నా ఇష్టమైన నటుడు.  నేను ఇండియా వచ్చిన తర్వాత, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి, ఆసుపత్రి వచ్చే రోగుల వసతికి కానీ.. ఆసుపత్రి అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలి అని మా అమ్మ నాతో వందసార్లు అయినా చెప్పి ఉంటుందని అన్నారు.  నేను మున్సిపల్ మంత్రి అయిన తర్వాత కూడా  మా అమ్మ గుర్తు చేశారని కేటీఆర్ అన్నారు. సెలెబ్రెటీలు కూడా స్వచ్చందంగా ముందుకి వచ్చి.. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.  తెలంగాణ లోని అన్ని ట్రస్టులకు ప్రాపర్టీ ట్యాక్స్ లను రద్దు చేస్తున్నామని అన్నారు. తారకరామారావు పేరు నిలబెట్టే పని చేస్తాను కానీ, చెడగొట్టే పని మాత్రం చేయనని అన్నారు.బసవతారకం ఆసుపత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. అవసరమైనవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.  నటుడు, ట్రస్ట్ ఛైర్మన్ నందమూరి  బాలకృష్ణ మాట్లాడుతూ  మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బీఎంటీ యూనిట్ ప్రారంభించడం గర్వకారణమన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. 40 బెడ్స్తో ప్రారంభమైన క్యానర్స్ ఆస్పత్రి.. ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుందంటే దానికి వైద్యుల కృషి ఎంతో ఉందని బాలయ్య కొనియాడారు.  నాన్న గారి స్పూర్తితోనే కెసీఆర్, తన కొడుకుకి తారకరామారావు అని పేరు పెట్టారు.  కేటీఆర్ చేతులమీదుగానే బీఎంటీ యూనిట్ ప్రారంభించడం గర్వకారణమని అన్నారు. ఎన్టీఆర్  బయోపిక్ లో క్యాన్సర్ హాస్పిటల్ గురించి కూడా ఉంటుందని అన్నారు.  

Related Posts