నిఫా వైరస్ వణికిస్తోంది. కేరళలో నిఫా వైరస్ కారణంగా పలువురు మృతి చెందారు. నిఫా వైరస్ ఆ తర్వాత కర్ణాటకలోకి ప్రవేశించింది. అక్కడ ఇద్దరికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వైరస్ సోకుతుందనే అనుమానాల నేపథ్యంలో కర్ణాటకలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు సిద్ధం
గబ్బిలాలు, పందుల ద్వారా వ్యాపిస్తూ కేరళలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న నిఫా వైరస్ సరిహద్దులు కర్ణాటకలోకి ప్రవేశించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు జిల్లాల కలెక్టర్లను, అధికారులను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ చేశాయి.
జ్వరం వచ్చి, నాలుగైదు రోజులుగా తగ్గకుంటే, వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. నిఫా వైరస్ గురించి ఎటువంటి ఆందోళనా అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి నడ్డా వ్యాఖ్యానించారు. లక్షణాలు కనిపించగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు.
నిఫా వైరస్ నేపథ్యంలో పలు జిల్లాలకు వెళ్లవద్దని కేరళ ప్రభుత్వం సూచించింది. కోజికోడ్, మలప్పురం, వేనాడ్, కన్నూర్ జిల్లాలకు వెళ్లవద్దని సూచనలు చేసింది. కోజికోడ్లో ప్రభుత్వం మే 25న అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. నిఫా వ్యాధిపై చర్చించనున్నారు.