YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్నాటక ఎన్నికలు .. గెలుపుపై ఎవరి ధీమా వారిదే

కర్నాటక ఎన్నికలు .. గెలుపుపై ఎవరి ధీమా వారిదే

బెంగళూరు, మే 10,
ముక్కోణపు పోటీలో పార్టీలు పూర్తి మెజార్టీ సాధించలేకపోతున్నాయా? అసలు కర్నాటకలో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయడం ఏ సీఎంకు అయినా కష్టమేనా? కన్నడ ఓటర్ల ఆత్రుతే దీనికి కారణమా?కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రంతో పాటు మరే చోట ఎన్నికలు జరగడం లేదు కాబట్టి అందరి దృష్టి ఆ రాష్ట్రంపై ఉంటుంది. అదే సమయంలో కన్నడ ఓటర్లకు ఒక విశిష్ఠ లక్షణం ఉంది. గడిచిన 38 ఏళ్లుగా వాళ్లు ఏ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోలేదు. ఎంతో బాగా పరిపాలన సాగించామని చెప్పుకున్న పార్టీలను కూడా కన్నడ ఓటర్లు తిరస్కరించారు. 1985 తర్వాత ఇంత వరకు అక్కడ ఏ పార్టీ వెంట వెంటనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు కన్నడ ఓటర్ల మనోగతాన్ని.కర్నాటకలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే. 1983 నుంచి 1985 వరకు ఆయన మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన రామకృష్ణ హెగ్డే 1984 లోక్‌సభ ఎన్నికల్లో పరాభవం ఎదురవడంతో తన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ఓటర్లు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఓటర్లు తిరస్కరిస్తూనే ఉన్నారు.దానికి మరో కారణం కూడా లేకపోలేదు. 1990 తర్వాత మూడు పార్టీలు ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో సింగిల్‌ పార్టీ అధికారంలోకి రావడం కష్టతరంగా మారింది. దీనికి ఇంకో కారణాన్ని కూడా ఎన్నికల విశ్లేషకులు జోడిస్తారు కన్నడ ఓటర్లు వివేకవంతులే కాదు, అత్రుతపరులు, డిమాండ్‌ చేసేవారన్నది ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయం. కాబట్టి వారి ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయని విశ్లేషిస్తున్నారు.భౌగోళికంగా కూడా కర్నాటకలోని మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్ విస్తరించి ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ దాదాపు రాష్టమంతా విస్తరించి ఉంది. బీజేపీ ప్రాబల్యం ఉత్తర కర్నాటక, మధ్య కర్నాటకలో ఎక్కువ. ఈ ప్రాంతాల్లో లింగాయత్‌ల సంఖ్య ఎక్కువ. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రావడంలో లింగాయత్‌ ఓట్లు కీలకంగా నిలిచాయి. అటు జేడీఎస్ పార్టీకి పాత మైసూరు ప్రాంతంలో గట్టి పట్టుంది. అక్కడ ఆ పార్టీకి పట్టుగొమ్మలుగా నిలిచే వొక్కలిగల సంఖ్య ఎక్కువ. రాష్ట్రమంతా విస్తరించి ఉన్న కాంగ్రెస్‌ ఎక్కువ ఓట్లు సాధిస్తోంది, అదే సమయంలో మిగిలిన పార్టీలు ఎక్కువ సీట్లు గెలుస్తున్నాయి.మరో వైపు మొత్తం కర్నాటక చరిత్రలో ఇప్పటి వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే ఐదేళ్లు పదవీకాలాన్ని పూర్తి చేశారు. ఆ ముగ్గురు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే. మొదటివారు నిజలింగప్ప, రెండో సీఎం దేవరాజ్‌ ఆర్స్‌. ఆ ఘనత సాధించిన మూడో సీఎం సిద్దరామయ్య.

Related Posts