YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఐడియా స్థానంలోజియో

ఐడియా స్థానంలోజియో

గాంధీనగర్, మే 10, 
గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులందరూ రిలయన్స్ జియో సిమ్‌లోకి మారాలని ఆదేశించింది. గత 12 సంవత్సరాలుగా సేవలు అందించిన వోడాఫోన్ ఐడియా సర్వీస్ స్థానంలో రిలయన్స్ జియోను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ ప్రభుత్వానికి, రిలయన్స్ జియో సంస్థకు కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఈ మొబైల్ సేవలు అందించనున్నారు. అయితే ఈ కొత్త ఒప్పందం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ పాత నంబర్లతోనే జియోలోకి మారిపోవచ్చు. అలాగే వీరికి క్లోజుడ్ యూజర్ గ్రూప్ ప్లాన్ కింద నెలకు రూ.37 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌లో వారికి ఫ్రీ కాలింగ్, 3000 ఎస్‌ఎమ్‌ఎస్‌లు చేసుకోవచ్చు. అదనపు ధరలతో 4జీ, 5జీ డేటా ఫ్లాన్‌లు కూడా లభిస్తాయి.అయితే ఈ ఒప్పందం ప్రకారం మొదటగా రెండు సంవత్సరాల వరకు రిలయన్స్ జిమో తమ సేవలును ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తుంది. ఆరు నెలల తర్వాత గుజరాత్ ప్రభుత్వం మొబైల్ ఫోన్ సర్వీసుల నాణ్యతను పరిశీలిస్తుంది. ఈ సేవలు సరైన సంతృప్తి ఇవ్వలేకపోతే ఈ ఒప్పందం కూడా రద్దవుతుంది. అలాగే కొత్తగా వచ్చే జియో సిమ్‌లలో వినియోగదారులందరికి మొదటి ఐదు నంబర్లు కామన్‌గా ఉండనున్నాయి. ఒకవేళ వినియోగదారులు ఇంతకు ముందు ఉన్న మొబైల్ నెంబర్లనే కావాలనుకుంటే వారికి ఎటువంటి చెల్లింపులు లేకుండానే జియో సిమ్‌లోకి మారేలా అవకాశం కల్పించింది.

Related Posts