YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్

ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్

హైదరాబాద్, మే 10, 
మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళలపై ఆర్థికభారం తగ్గించేందుకు టీ-24 టికెట్‌ను రూ.80కే అందించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు టీ24 టికెట్‌ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్‌ సిటిజన్లకు రూ.80గా ఇటీవల టీఎస్‌ఆర్టీసీ తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకు రూ.10 తగ్గించి రూ.80లకే టీ24 టికెట్ అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త టి-24 టికెట్‌ ధర అందుబాటులోకి వచ్చందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మహిళపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులను పెంచింది. బెంగళూరు, హుబ్లీ, దావణగెరె ప్రాంతాలకు తెలంగాణ నుంచి ఏసీ స్లీపర్, సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులను నడుపుతుంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మరింత శులభతరం అవుతుందని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే బస్సులకు మంచి ఆదరణ ఉంటుంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో కర్ణాటక రాష్ట్రానికి బస్సు సర్వీసులను పెంచినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల స్పష్టం చేశారు. ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ అందిస్తున్న సర్వీసులను వినియోగించుకోవాలని కోరుతున్నారు.తెలంగాణ నుంచి వివిధ కారణాలతో చాలా మంది నిత్యం కర్ణాటకకు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ప్రైవేట్ బస్సుల్లో అధిక టికెట్ల ధరలు ఉండటంతో ప్రయాణికులు సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లోనే ట్రావెల్ చేసేందుకు ఇష్టపడతారు. దీంతో తెలంగాణ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు పెంచడంతో ఆదాయాన్ని మెరుగుపర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో, అన్ని సదుపాయాలతో టీఎస్‌ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పనకు టీఎస్ఆర్టీసీ ఒక అడుగు ముందే ఉంటుంది. ఇటీవల లహరి ఏసీ స్లీపర్, నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్, హుబ్లీ మధ్య టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించింది. తెలంగాణ, కర్ణాటక మధ్య మరిన్ని బస్సులను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చిందని, ప్రయాణికులు ఆ సదుపాయాలను ఉపయోగించుకోని సురక్షితమైన ప్రయాణం చేయాలని ఎండీ సజ్జనార్ సూచించారు.

Related Posts