బెంగుళూర్ మే 10
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దక్షిణాది రాష్ట్రం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికలపై జోరుగానే చర్చ జరుగుతోంది. కర్ణాటక ఎన్నికలు మాత్రం ఓ విషయాన్ని తాజాగా రుజువు చేశాయి. కర్ణాటక ఎన్నికల సందర్భంగా చేసిన తనిఖీల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్.. ఇలా మొత్తం రూ.375 కోట్లు పట్టుబడినట్లు భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటకలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ విలువ నాలుగున్నర రెట్లు ఎక్కువగా ఉండటం కొసమెరుపు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 83.93 కోట్లను అధికారులు సీజ్ చేశారు.అసెంబ్లీ ఎన్నికలు రానురానూ కాస్ట్లీగా మారుతున్నాయని కర్ణాటక ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు, మద్యం.. ఇతరత్రా తాయిలాల విలువ లెక్కిస్తే ఇట్టే అర్థమైపోతుంది. భారత ఎన్నికల సంఘం మే 9న వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. కర్ణాటక ఎన్నికల్లో వందల కోట్ల ధన ప్రవాహం సాగిందని స్పష్టమైంది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎంత కట్టడి చేసినా అనధికారికంగా అభ్యర్థులు డబ్బును విచ్చలవిడిగా పంచిపెట్టారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా చేసిన తనిఖీల్లో డబ్బు, మద్యం, డ్రగ్స్.. ఇలా మొత్తం రూ.375 కోట్లు పట్టుబడినట్లు భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటకలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ విలువ నాలుగున్నర రెట్లు ఎక్కువగా ఉండటం కొసమెరుపు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 83.93 కోట్లను అధికారులు సీజ్ చేశారు. ఈసారి.. కాస్తంత ఎక్కువ నిఘా పెట్టగా రూ.375 కోట్లు పట్టుబడటం గమనార్హం.