జగ్గంపేట
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి తన నివాసంలో బుధవారం లేఖ విడుదల చేశారు.దానిలో సత్యమే గెలిచిందని, త్వరలో తన రాజకీయ భవితవ్యాన్ని ప్రకటిస్తానన్నారు. తుని బహిరంగ సభ తర్వాత రోజు 2016 వ సంవత్సరం ఫిబ్రవరి 2 వ తేదీన నా నివాసం చుట్టూ 6 వేల మంది పోలీసులు చుట్టుముట్టారని, నన్ను అభిమానించే వ్యక్తులు తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీగా పెట్టారు, బెయిల్ తెచ్చుకోండి, లేదా అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని సలహాలు ఇచ్చారు. అదే చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం కూడా చులకనయ్యే ప్రమాదం ఉండేది.అప్పటి డిజిపికి కూడా ఉత్తరం ద్వారా సభకు వచ్చిన వారిని బాధ పెట్టకండి, సమస్త కేసులు నామీద పెట్టుకోండి అని లేఖలో ప్రస్తావించాను.ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదన్నారు.ఎన్నో ఉద్యమాలు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పాడుచేయమని ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదు.మాజాతి రిజర్వేషన్ జోకర్ కార్డు లా అయినందుకు బాధపడుతున్నానన్నారు.నా రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తాను.ప్రజలలలో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉంది.
మార్పు వస్తేనే రాజకీయాల్లో ఉన్నవారు తప్పకుండా మారి తీరుతారు.రాజకీయ నాయకులను ప్రజలు కోరుకోవలసింది ఒక్కటే. మాకు సారా, డబ్బు వద్దండి . పేదవారి కోసం చేసే ఉద్యమాలు వారి చిరునవ్వే నాకు ఆక్సిజన్, ఊపిరి.అన్ని పనులతో పాటు పండుగలు తల్లి దండ్రుల కార్యక్రమాలు ఆర్థిక బాధలు ప్రక్కన పెట్టింది న్యాయస్థానం కు గౌరవం ఇవ్వడం కోసమే అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.