YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డీజీపీని కలిసిన కోమటిరెడ్డి, సంపత్ కుమార్

డీజీపీని కలిసిన కోమటిరెడ్డి, సంపత్ కుమార్

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లు డీజీపీ మహేందర్రెడ్డితో గురువారం సమావేశమయ్యారు.  హైకోర్టు తమ శాసనసభ్యత్వాలను పునరుద్దరిస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ ఇంతవరకు తమకు గన్మెన్లను కేటాయించలేదని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి పశువులను బాదినట్లు బాదుతున్నారని వారు డీజీపీకి వివరించారు. తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీజీపీ ని సంపత్, నేను కలిసాం. కోర్టు   ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. దాన్నే డీజీపీకి వివరించాం. ప్రజా బలం లేని టి ఆర్ ఎస్ నాయకులకు గన్ మెన్లను ఇచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి , ఎమ్మెల్యే వేముల విరేశంలు హత్యల కేస్ లో  ఉన్నారని డిజిపి కి చెప్పినాం. కోర్టు మాకు అనుకూల తీర్పు తర్వాత మా కార్యకర్తలు సంబరాలు చేస్తే వారి పై కేసు లు పెట్టిన్నారు.  పోలీస్ లు ఇలాంటి అక్రమ కేసులు అపకపోతే జంతర్ మంతర్ దగ్గర అమర నిరాహార దీక్ష చేస్తామని చెప్పినామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ లో బర్రెలను కొట్టినట్లు కొడుతున్నారని అయన ఆరోపించారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ హై కోర్టు తీర్పును అమలు పరచాలని డిజిపి ని కోరినాం. ఎమ్మెల్యే లకు కల్పించే సదుపాయాలు మాకు కల్పించాలీ. మా గొంతును నలిపేయాలని టి ఆర్ ఎస్ చూస్తుంది. మాకు గన్ మెన్లను  పునరుద్దించాలని కోరాం. సెక్యూరిటి కమిటీ పంపిస్తామని చెప్పి డీజీపీ కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని అన్నారు. 

Related Posts