YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించాలి మంత్రి ఎర్రెబెల్లి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించాలి మంత్రి ఎర్రెబెల్లి

హైదరాబాద్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం నిజం కాదని, నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మె ను వారు వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలవలేదు. ప్రభుత్వం తరపున నేను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదు. అలా ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం అబద్ధం. అలాంటి ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మ వద్దు. ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుంది. సీఎం కెసిఆర్  మనసున్న మహారాజు. సీఎం కి జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై మంచి అభిప్రాయం ఉంది. ఆ పేరును చెడ గొట్టుకోవద్దు. ప్రభుత్వాన్ని శాసి0చాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పని అన్నారు,
జేపీలు లు సమ్మె విరమిస్తే, సీఎం  వారికి తప్పకుండా సాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలు మరియు చట్ట విరుద్ధం. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధమని అన్నారు.
సంఘాలు కట్టబోమని, యూనియన్ లలో చెరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్ల కు దిగబోమని మీరు ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చారు. మీరు రాసిచ్చిన ఒప్పందాలను మీరే ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదు. పైగా సోషల్ మీడియాలో జరుగుతున్న వెంటనే ప్రచారాన్ని నిలిపివేయాలి. మీరు నాతో ఫోన్ ద్వారా మాట్లాడారు. మీరు మీ సమస్యలు చెప్పుకున్నారు. మీరు సమ్మె విరమించాలని నేను సూచించాను. కానీ, ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ఇప్పటికైనా మించిపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే సమ్మె ను వివరించాలి. విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు విజ్ఞప్తి చేశారు.

Related Posts