YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దేశానికే ఆదర్శం : మంత్రి పోచారం

దేశానికే ఆదర్శం : మంత్రి పోచారం

ఆరోగ్యకరమైన  విత్తనం  నాటితే పంట  దిగుబడి బాగుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం నాడు  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ  వ్యవసాయ విశ్వవిద్యాలయం  ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన "విత్తన మేళా-2018" ని అయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, రైతులు పాల్గోన్నారు. మంత్రి పొచారం మాట్లాడుతూ ప్రధానమంత్రి రైతుల ఆదాయం రెట్టింపు పు చేయిచాలంటున్నాడు, కాని ఎలా అన్నది ఎవరు చెప్పడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడగానే వ్యవసాయ దండగ కాదు పండుగ చేయాలని ముఖ్యమంత్రి దృడ సంకల్పంతో ఉన్నారు. దేశానికి అన్నం పెట్టె రైతన్న ఆత్మాభిమానంతో బతకాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని మంత్రి అన్నారు. ప్రపంచంలో మొదటిసారి ఎకరాకు రూ. 8000 ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ. ప్రైవేటు వ్యాపారుల దగ్గర అప్పు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తుంది. విత్తనం ఎంపికే పంట దిగుబడి మూలం. శాస్త్రవేత్తల మేధాశక్తికి రైతుల శ్రమ తోడయితే ఆద్భుత ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం రాయితీలతో పాటు మౌళిక సదుపాయాలు కల్పిస్తుంది. మూల విత్తనంపై 50 శాతం సభ్సిడీని అందజేస్తాం. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్లు, తొక్కీసలాట, లాఠీచార్జీలు జరిగేవి.  రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు చూపుతో  నేడు విత్తనాలు, ఎరువుల కొరత లేదని అన్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలం కొరకు 7.5 లక్షల క్వింటాల్ల విత్తనాలు, 8 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రసాయన ఎరువులు అధికంగా వాడితే భూమి దెబ్బతింటుంది. భూమిని అమ్మినవారు చెడిపోయారు, కాని భూమిని నమ్ముకున్నవారు ఎప్పుడు చెడిపోలేదని అన్నారు. రైతులు ఏది అడిగినా చేయలని ఉంటుంది.  రాష్ట్రంలో ఈ యాసంగిలో 3,600 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 30 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశాం. మక్కలు బీహార్, ఉత్తరాధి రాష్ట్రాలలో రూ. 1100 కే కొనుగోలు, కాని మన రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర అందించాలని రూ.1420 కొనుగోలు చేస్తున్నామన్నారు. దురదృష్టవశాత్తు  రైతు మరణిస్తే వారం రోజులలోనే కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందాలి. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్సురెన్స్ కంపెనీలతో సమావేశమై విదివిధానాలను రూపొందిస్తారని మంత్రి వెల్లడించారు. 

Related Posts