న్యూ ఢిల్లీ మే 12
ఆస్తుల విభజనపై ఏపీ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ పిటీషన్‌పై రిప్లై దాఖలుకు తెలంగాణ, కేంద్రానికి సుప్రీం నాలుగు వారాల గడువు ఇచ్చిది. షెడ్యూల్ 9,10 లలో ఉన్న సుమారు 1.4 లక్షల కోట్ల ఆస్తుల విభజన జరగలేదని సుప్రీంను ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం పిటీషన్ పై గతంలో కేంద్రానికి, తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నోటీసులకు తెలంగాణ, కేంద్రం స్పందించలేదు. దీంతో మరో 4 వారాల సుప్రీం గడువు ఇచ్చింది. ఆస్తుల విభజనకు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలన్న ఏపీ అభ్యర్ధనను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.తెలంగాణ పై సుప్రీంకోర్టు లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రూ.1,42,601 కోట్ల విలువైన ఆస్తులను విభజించకుండా తెలంగాణ కాలయాపన చేస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. విభజన జరగాల్సిన 91శాతం ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఏపీ తెలిపింది. 8 ఏళ్లయినా ఆస్తుల విభజనకు తెలంగాణ సహకరించడం లేదని ఏపీ వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం ఏపీ ప్రజల హక్కులకు తెలంగాణ భంగం కలిగించిందంటూ పిటిషన్‌లో ఏపీ పేర్కొంది. ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని సుప్రీంను ఏపీ కోరింది.