తిరుమల తిరుపతి దేవస్థానం మాజి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు దేవస్థానంలో జరుగుతున్న అవినీతి పనులపై లేవనెత్తిన అంశాలపై సి.బి.ఐ విచారణ చెయ్యాలి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేసారు. గురువారం నాడు శ్రీ కాళహస్తి లో అయన మీడియాతో మాట్లాడారు. తనను దేవస్థానం ప్రధాన అర్చకుడి స్థానం నుంచి తొలగిస్తారని తెలిసి ఒకరోజు ముందుగా తమిళనాడులో పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు చెయ్యడం లోని ఆంతర్యం ఏమిటో రమణ దీక్షీతులు చెప్పాలని అన్నారు. ఇప్పటివరకు జరిగిన తప్పులను భక్తులకు ఎందుకు చెప్పలేదో చెప్పాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్వామి వారి బంగారు ఆభరణాలను చంద్రబాబు ఇంట్లో దాచి ఉంచారు అని ఆరోపించారు, దీనిపై కూడా రమణ దీక్షతులు స్పందించాలని అన్నారు. ప్రభుత్వ విచారణ సంస్థల ద్వారా చంద్రబాబు నివాసంలో సోదాలు నిర్వహించాలి అని ఒకవేళ చంద్రబాబు తప్ప చేసినట్లు నిరుపణ జరిగితే అతనిని ఉరితీసిన తప్పు లెదని అన్నారు.