YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అధికార బిఆర్ఎస్ లో లుకలుకలు

అధికార బిఆర్ఎస్ లో లుకలుకలు

హైదరాబాద్, మే 13, 
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అధికార బిఆర్ఎస్ లో లుకలుకలు పెరుగుతున్నాయని కేడర్ కోడై కూస్తోంది. BRS పార్టీ ఎమ్మెల్యేలకు…ఆ పార్టీ కార్పొరేటర్లకు మధ్య గ్యాప్ పూడ్చలేనంతగా వుంటోందన్న చర్చ సాగుతోంది. వివిధ రాజకీయ కారణాలతో ఎమ్మెల్యేలకు…కార్పొరేటర్ లకు మధ్య ఎడం చాంతాడంత పెరుగుతోందట. అప్పుడప్పుడు ఆ విబేధాలు బయట పడితే…మరి కొన్ని సందర్భాల్లో లోలోపల కత్తుల దూసుకుంటున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఫలితాలపై వీరి కోల్డ్ వార్ ఎటువంటి ప్రభావం చూపుతుందన్న టెన్షన్ పైనా అటెన్షన్ మొదలైంది.గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని చోట్ల సయోధ్య ఉన్నా…మరికొన్ని చోట్ల రాజకీయ విభేదాలు ఎప్పటి కప్పుడు ఏదో ఒక రూపంలో బయట పడుతున్నాయి. జూబ్లీ హిల్స్ , అంబర్ పేట, ఉప్పల్, ఖైరతాబాద్ ,శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయని అధిష్టానానికి సైతం రిపోర్ట్ లు పోతున్నాయట. జూబ్లీహిల్స్, ఉప్పల్, అంబర్ పేట నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్ అనేది అందరికీ తెలిసిన విషయమే అని పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారంలో ఉంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపీనాథ్ …కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, అంబర్ పేట నియోజక వర్గంలో కాలేరు వెంకటేష్ కు…గోల్నాక కార్పొరేటర్ కు…..ఉప్పల్ లో MLA సుభాష్ రెడ్డికి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవికి మధ్య పచ్చ గడ్డి వేసినా, వెయ్యకున్నా ఎప్పటికప్పుడు భగ్గుమంటోంది.హైదరాబాద్ ఏ పార్టీకైనా అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ స్థానాలు గెల్చుకునే పార్టీకే అధికార పగ్గాలు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య వుంటేనే, ఫలితాలు ఆశాజనకం. కానీ గ్రేటర్ పరిధిలోని పార్టీ నేతల్లో రోజుకో రచ్చ బయటపడితే, మొదటికే మోసమని పార్టీ నేతలంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య గ్యాప్ ను తగ్గించాలని పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. చూడాలి, పార్టీ నాయకుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలితమిస్తాయో…

Related Posts