YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వామ్మో... ట్రాఫిక్...

వామ్మో... ట్రాఫిక్...

అనంతపురం నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోయే పరిస్థితి. పండుగ వేళల్లో పాతూరు రోడ్లలో ప్రయాణించారంటే ‘వద్దురా బాబోయ్‌’ అనాల్సిందే. దీనంతటికీ కారణం పెరుగుతున్న జనాభా, వాహనాలకు తగ్గట్టుగా రోడ్లు లేకపోవడమే. రోడ్లు ఆక్రమణలకు గురికావడం, ముఖ్యంగా ఎక్కడా పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో రోడ్లు ఇరుకుగా తయారయ్యాయి. వారం రోజుల్లో నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్‌ పనిచేస్తున్నాయి. దీని వలన ట్రాఫిక్‌ ఆంక్షలు కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. ప్రతి కూడలికి ఒక ఎస్‌ఐ స్థాయి అధికారితో పాటు ఏఎస్‌ఐ, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్‌ ఉంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా పనిచేస్తుండటంతో ఎక్కడైనా సమస్య తలెత్తినపుడు వెంటనే పరిష్కరిస్తున్నారు. కొన్నేళ్ల కిందట ఏర్పాటు చేసిన సిగ్నలింగ్‌ వ్యవస్థ అధికారుల అలసత్వం కారణంగా మనుగడ కోల్పోయాయి. సిబ్బంది చెమటోడ్చి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసేవారు. ఈ విషయం ఎస్పీ అశోక్‌కుమార్‌ దృష్టికి వెళ్లడంతో సిగ్నలింగ్‌ వ్యవస్థను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం ముందుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు. నగరంలో ప్రధానంగా ప్రమాదాలు జరిగే పీటీసీ ఫ్‌లైఓవర్‌పై స్పీడ్‌ నియంత్రణ కోసం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వర కూ ఒక ఎస్‌ఐ, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌లతో విధులు నిర్వహిస్తున్నారు. హెచ్చరికలు చేస్తూ స్పీడ్‌ కంట్రోల్‌కు చర్యలు తీసుకున్నారు. ప్రమాదాలు, ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు వీలైనంత ఎక్కువ మంది సిబ్బందిని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఒక డీఎస్పీ, 59 మంది సిబ్బంది, అప్పుడప్పుడు తాత్కాలిక విధులకు 30 మంది ఏఆర్‌ విభాగం నుంచి సిబ్బందిని కేటాయించారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు సిబ్బందిని కేటాయించిన దాఖలాలు లేవు.

Related Posts