YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బజరంగ్ బలి' నినాదాలతో హోరెత్తిన ఏఐసీసీ కార్యాలయం

బజరంగ్ బలి' నినాదాలతో హోరెత్తిన ఏఐసీసీ కార్యాలయం

న్యూఢిల్లీ మే 13
కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యతల పరంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ చేరుకోవడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు వెల్లువెత్తాయి. కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, బాణసంచా కాలుస్తూ సందడి చేయగా, పలువురు కార్యకర్తలు హనుమంతుడి వేషధారణలతో 'బజ్‌రంగ్ బలీ' నినాదాలు చేశారు.''బజ్‌రంగ్ బలి.. కాంగ్రెస్‌తో ఉన్నారు. బీజేపీకి ఆయన జరిమానా వేశారు'' అని హనుమాన్ వేషధారణలో ఉన్న ఒక కార్యకర్త కమలం పార్టీపై విసుర్లు విసిరారు.కులం, మతం ఆధారంగా మతాల మధ్య చిచ్చుపెట్టి, విద్వేషాలు రగిలిస్తే బజ్‌రంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలు, వ్యక్తులపై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం వివాదాస్పదమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులంతా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బజ్‌రంగ్ దళ్ అంశాన్ని ఎన్నికల ప్రచార అంశంగా బీజేపీ చేసుకున్నప్పటికీ, కర్ణాటక సమస్యలను, ప్రధానంగా ప్రభుత్వ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా కాంగ్రెస్ పగడ్బందీగా ప్రచారం సాగించింది.
ఈసీ డేటా..
కాగా, కర్ణాకట ఎన్నికల ఫలితాలకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న డేటాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కాంగ్రెస్ 121 నియోజకవర్గాల్లో, బీజేపీ 72 చోట్ల, జేడీఎస్ 24 చోట్ల, స్వతంత్రులు 2 స్థానాల్లో, ఇతరులు మరో 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారని ఈసీ వెబ్‌సైట్ డేటా పేర్కొంది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఖాయమని తేలిపోయింది..

Related Posts