YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తలనొప్పిగా కళ్యాణదుర్గం రాజకీయాలు

తలనొప్పిగా కళ్యాణదుర్గం రాజకీయాలు

అనంతపురం, మే 16,
అనంతపూరం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీలో గ్రూపు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. యువగళం లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం రోజున పాదయాత్ర చేపట్టాలని టీడీపీ అధిష్టానం ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి పాదయాత్రలు చేపడుతున్నారు. దీంతో టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.2024 ఎన్నికలు సమీప ఇస్తున్న తరుణంలో కళ్యాణ దుర్గం టీడీపీ నేతలు గ్రూపు రాజకీయాలు చేయడం చంద్రబాబుకు తలనొప్పిగా మారుతుంది. కార్యకర్తలు కూడా ఎటువైపు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. కళ్యాణ దుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు వర్గం సెట్టూరు మండలం యాటికల్లు నుంచి పాదయాత్ర చేపడుతుంటే మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయులు పాపంపల్లి నుంచి పాదయాత్ర చేపడుతున్నారు. దీంతో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయి పాదయాత్ర చేపడుతుండడంతో సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.మూడు సంవత్సరాల నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎవరికి వారే యమునా తీరే చందంగా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో టీడీపీలో గ్రూపు రాజకీయాలు మితిమీరిపోతున్నాయని కార్యకర్తలు వాపోతున్నారు. ఈ సంఘీభావ పాదయాత్ర వల్ల టీడీపీ మైలేజ్ తగ్గే అవకాశం ఉందని పలువురు నాయకులు గుసగుసలాడుతున్నారు. నారా లోకేష్ అనంతపూర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టిన సమయంలో కళ్యాణదుర్గం టీడీపీ గ్రూప్ రాజకీయాలు గురించి ఆయన దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ పాదయాత్ర వల్ల టీడీపీ లాభమా నష్టమా అనేది చూడాల్సి ఉంది.

Related Posts