బ్యాంకులు కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. కరోనా కష్టాలని జ్ఞాపకం చేస్తున్నాయి. రిజర్వు బ్యాంకు గవర్నర్ చాలా క్లియర్ గా రెండు సార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చారు. ఏ వ్యక్తి అయినా సరే ఇరవై వేల వరకు ఎటువంటి ఆధారాలు లేకుండానే రెండు వేల నోట్లను మార్చుకోవచ్చన్నారు కదా ? కానీ బ్యాంకులు మాత్రం ఆలా చెయ్యట్లేదు
ఉదాహరణకి ఈరోజు ఆక్సిస్ బ్యాంకు ప్రకాశనగర్ బ్రాంచికి ఒకతను తన దగ్గర వున్న ఒకే ఒక రెండువేల నోటును తన అసిస్టెంట్ కిచ్చి పంపిస్తే బ్యాంకు సిబ్బంది తీసుకోలేదు ఏమిటి అని అడిగితే మీరే బ్యాంకుకి స్వయంగా వచ్చి మార్చుకోండి అని ఒక బోడి సలహా ఇచ్చారు. ఉసూరు అంటూ ఈ పెద్దమనిషి వెలితే మీ ఫోన్ ప్రూఫ్ ఇంకా మీ ఐడి కార్డు చుపించామన్నారట.
హతాశుడైన ఈ వ్యక్తి ఇది దారుణం పైగా నేను మీ కస్టమర్న్ ని అన్న కూడా ప్రూఫ్ల్యూ అడిగారట. మొత్తానికి రెండుగంటలు వృధా కదా పైగా మాడు పగిలే ఎండలాయే ! స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో ప్రూఫ్ల్యూ అడుగుతున్నారు. మా విలేఖరి ఈ విషయమై రిజర్వు బ్యాంకు హైదరాబాద్ ఇష్యూ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ని వివరణ అడుగగా ఆయన చాలా క్లియర్ గ ఏ ఆధార పత్రం చూపించకుండానే ఇరవైవేల వరకు రెండువేల నోటు మార్చుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. మరి కస్టమర్ ఎవరికీ తన కష్టాన్ని చెప్పుకోవాలి ? ప్రభుత్వాలు నిలబడగలవా ?