YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ టీడీపీ మహానాడు హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు కీలక నేత మోత్కుపల్లి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డుమ్మా

అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ టీడీపీ మహానాడు             హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు కీలక నేత మోత్కుపల్లి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డుమ్మా

హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ టీడీపీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకోగా తెలంగాణ నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. వేదికపై చంద్రబాబుకు అటూ ఇటుగా ఎల్.రమణ, దేవేందర్ గౌడ్ లు ఆసీనులయ్యారు. టీటీడీపీ కీలక నేత మోత్కుపల్లి, ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మహానాడుకు హాజరుకాలేదు. అంతకు ముందు కళాకారులు పాటలు పాడుతూ ఆహూతులను ఉల్లాసపరిచారు.తెలంగాణ టీడీపీ మహానాడుకు చంద్రబాబు రాకతో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనబడింది. ఈ సందర్భంగా అమలుకు నోచుకోని టీఆర్ఎస్ హామీలు అనే తీర్మానాన్ని మహానాడులో స్వర్ణకుమారి ప్రవేశపెట్టగా దాన్ని నండూరి నర్సిరెడ్డి మరి కొందరు నేతలు బలపరిచారు. టీడీపీ నేత తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల కోసం నోటిఫికేషన్లు పత్తా లేవనీ..టీడీపీ నేత నర్శిరెడ్డి తనదైన శైలిలో సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక లక్ష ఉద్యోగాలిస్తామనికేసీఆర్ 72 సార్లు ప్రకటించాడనీ అయినా ఎటువంటి ఉద్యోగాలు యువతకు రావటంలేదన్నారు. ఈ సందర్భంగా ఎల్.రమణ ప్రసంగిస్తూ, వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు టీడీపీని వీడారని చెప్పారు. చంద్రబాబు అండతో తెలంగాణలో పార్టీకి మళ్లీ  పూర్వవైభవం తీసుకొస్తామని, చరిత్రను తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని అన్నారు.అనంతరం నండూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ పాలన చూస్తే హింసించే రాజు 26వ పులకేశి పరిపాలన కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్... నాలుగేళ్లలో రూ. 6లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి.. రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేసినా.. ఏ ఒక్క హామీలను ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో మాత్రం వందకు వంద శాతం హామీలు అమలు చేసినట్లు అందమైన అబద్దాలను అద్భుతంగా చెప్పారని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఏ బుక్ షాపుకు వెళ్లినా అందమైన అబద్దాల బుక్ ఇవ్వమంటే టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇచ్చే పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు యాగాలమీద ఉన్న శ్రద్ధ త్యాగాల మీద లేదని ఆయన విమర్శించారు. తరువాత చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. 

Related Posts